ప్రశ్న: మనం వాడే మందులు పురుషుల్లో, స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా?
జవాబు: మనం వాడే మందులు మన దేహంపై ఎంత ప్రభావితంగా పనిచేస్తాయి అనే విషయం, ఆ మందు ఎంత త్వరగా దేహంలో కలిసిపోతుంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మందులు దేహంలోని కాలేయంలో ఉండే ఎన్‌జైములచే విడగొట్టబడి దేహానికి అందజేస్తాయి. ఈ ఎన్‌జైములను ఉత్పన్నం చేసే జన్యువులక్రియాశీలతస్థాయి మగ, ఆడవారిలో వేర్వేరుగా ఉంటుంది. అంటే ఒకే మోతాదులో తీసుకొన్న ఒక మందు పురుష, స్త్రీ రోగులలో వేర్వేరుగా పనిచేస్తుంది. ఆ మందువల్ల కలిగే దుష్పరిణామాలు (side effects) కూడా ఒకే రకంగా ఉండవు. ఉదాహరణకు ఆస్పిరిన్ పురుషులకు గుండె వ్యాధుల విషయంలో ఎక్కువ రక్షణ ఇస్తే, కొన్ని సమయాలలో ఆ మందు స్త్రీలపై అంత ప్రభావం చూపదు.
స్త్రీ పురుషులలో హార్మోన్ సమతుల్యత, దేహంలో కొవ్వు, కండరాల కణజాలం వ్యాపనం ఒకే విధంగా ఉండకపోవడంతో వారి దేహాలపై మందుల ప్రభావం ఒకేరకంగా ఉండదు. అందుకే డాక్టర్లు ఎవరికి తగిన మోతాదులో వారికి మందులను ఇస్తారు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...