Saturday, September 06, 2014

గాజు ఏ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉంటుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న : గాజు ఏ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉంటుంది?

జవాబు : పదార్థమేదైనా మన కంటికి పారదర్శకంగా ఉందా అనే విషయం, ఆ పదార్థం గుండా కంటికి కనిపించే కాంతి (400 నుంచి 700 నానోమీటర్లు ఉండే విద్యుదయస్కాంత వికిరణాలు) దానిగుండా ప్రసరిస్తున్నాయా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ కాంతి కిరణాలు ఆ పదార్థంపై పడినపుడు పరావర్తనం చెందడం కానీ, చిందరవందరగా చెదరడం కానీ జరగకుండా, అవి ఆ పదార్థం గుండా చొచ్చుకు పోవాలి. అంటే, ఆ కాంతి తరంగాలు ఆ పదార్థంలోని పరమాణువులపై జరిపే పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది.

క్లుప్తంగా, ఒక పదార్థం పారదర్శకమా కాదా అనే విషయం ఆ వస్తువులోని అణువుల నిర్మాణం, దానిపై పడే కాంతి తరంగధైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గాజులో 'ఏంటిమోనీ' లాంటి మూలకాల అణువులు ఉంటే, అవి కాంతి తరంగాల పురోగతిని పూర్తిగా అడ్డుకోవడంతో ఆ గాజు కాంతి నిరోధకంగా కనపడుతుంది.

కంటికి కనపడే కాంతి కొన్ని గాజు పదార్థాల విషయంలో పారదర్శకమైనా, పరారుణ, అతినీలలోహిత కిరణాల విషయంలో నిజం కాదు. ఉదాహరణకు పరారుణ కిరణాలు 'సిలికాన్‌' గుండా చొచ్చుకొనిపోగలవు. అలాగే x- కిరణాలు మానవ శరీరంలోని అంతర్భాగాలను కూడా చూడగలవు. రేడియోతరంగాలు దృఢమైన ఇటుక గోడల గుండా కూడా చొచ్చుకుపోగలవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  •  ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...