Saturday, September 13, 2014

మనం ఆవులించినపుడు. నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మనం ఆవులించినపుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాగే నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

జవాబు: భావోద్వేగాల(emotions)కు ముఖంలోని అన్ని భాగాల కన్నా కళ్లే ప్రతిబింబాలు. భావోద్వేగాలకు లోనైనపుడు కాంతి కణితె భాగం కింద ఉన్న కన్నీటి గ్రంధులు కన్నీటిని స్రవిస్తాయి. ఏడ్చినపుడు, నవ్వినపుడు కన్నా మానసికంగా ఎక్కువ ఉద్వేగానికి, భావ ప్రకటనకు లోనవడం వల్ల ఏడ్చినపుడు ఎక్కువగా ఈ గ్రంధులు స్రవిస్తాయి. నవ్వినపుడు కన్నా ఆవలించినపుడు బాగా తక్కువగా స్రవిస్తాయి. కన్నీళ్లు లేకుంటే మన కనుగుడ్లు బాగా ఎండిపోయి పనికిరాకుండా ఉండేవి. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే కన్నీళ్లు ఎప్పుడూ స్రవిస్తుంటాయి. ఆ కన్నీళ్లు కనురెప్పల కిందకు చేరుకున్నాక కను గవ్వలు ఒక కుంచెలాగా ఆ కన్నీటి ద్రవాన్ని ఓ కందెనలాగా మన కంటి పొరమీదకు నేర్పుతుంది. తద్వారా దుమ్ముధూళికి తారసపడిన కనుగుడ్లు ఎండిపోకుండా రక్షణ పొందుతున్నాయి.

నవ్వినపుడు ఏడ్చినపుడు ఈ కన్నీటి స్రావం ఎక్కువ కావడం వల్ల కళ్లు, ముక్కు కలిసేచోట ఉండే కన్నీటి కోశాలు నిండిపోయి కన్నీరు కారుతుంది. సినిమాలలోనూ, కథల్లోనూ గుండెకు హత్తుకునే సన్నివేశాలను చూసి చలించినపుడు విపరీతమైన భక్తి, కృతజ్ఞత భావాలు ముంచేసినపుడు, పగలబడి నవ్వినపుడు, దుఃఖంతో ఏడ్చినపుడు, అలసిపోయి ఆవులించినపుడు భావోద్వేగాలు పెరుగుతాయి. ఆ సమయంలో నాడీ తంత్రుల ద్వారా మెదడు కన్నీటి గ్రంధుల్ని ప్రేరేపించడం వల్ల కన్నీళ్లు మామూలు స్థితుల్లో కన్నా అధికంగా స్రవిస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...