ప్రశ్న: వెదురు వృక్ష జాతికి చెందిందా లేక గడ్డిజాతికి సంబంధించిందా?
జవాబు: అనేక రకాల వెదురు దట్టమైన గొట్టాల రూపంలో ఉంటుంది. కొన్ని రకాలు 40 మీటర్ల పొడవు, 80 సెంటి మీటర్ల చుట్టు కొలతతో పెరిగినా, ఆ మొక్కల మధ్య భాగాన్ని కాండం అంటారే కానీ, బోదె అని అనరు. నిజానికి వెదురు 'పొయాసియా' అనే గడ్డి జాతికి సంబంధించిన మొక్క.మిగతా గడ్డి మొక్కల వలె వెదురు కాండాలు కాలం గడిచే కొలదీ మందంగా ఎదగవు. నేలలో నుంచి ఒకే మందంతో నేరుగా, పైవైపు పెరుగుతాయి. ఈ భూమిపై వెదురు కొన్ని నెలల వ్యవధిలోనే ఎంతో ఎత్తుకు అతి త్వరగా పెరిగే గడ్డి మొక్క. మిగతా చెట్ల దుంగలలో నిండా ఉండే కొయ్య పదార్థంతో కాకుండా, వెదురు ఎంత పొడవు పెరిగినా వాటి మధ్య భాగం బోలుగా ఉండి, బొంగుల రూపంలో ఉంటుంది.
- ప్రొ|| ఈ. వి. సుబ్బారావు, హైదరాబాద్
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...