Friday, September 03, 2010

కనురెప్పలార్పడమేల? , Eye lids blinks frequently- why?




ప్రశ్న: కనురెప్పలను తరచు ఆర్పడం మూలంగా ఉపయోగమేంటి?
-ఆరెస్సార్‌ మీనాశ్రీ, విజయవాడ
జవాబు: కంటి రెప్పలను ఆర్పడమనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. సున్నితమైనది. రెప్పలు తరచు ఆర్పడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిముల నుంచి కంటికి రక్షణ కలుగుతుంది. కంటి రెప్ప పడినప్పుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటి లోపల ఉండే చిన్న గ్రంథుల్లో నుంచి స్రవించే ఈ నీటినే మనం కన్నీరు అంటాం. ఈ నీటితెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. కంటి మీదకు పడే సూక్ష్మమైన అవాంఛిత కణాలను కంటి కలికిలోకి చేరే విధంగా కంటి కదలికలు తోడ్పడుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...