Saturday, January 05, 2013

Who was Joseph Pulitzer?-జోసెఫ్ పులిట్జర్ ఎవరు ?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పత్రికారంగములొ ఒకవ్యక్తి  ప్రజల్ని ఉత్తేజితులను చేసిన మహానుభావుడు " పులిట్జర్ " ఆయన గురించి తెలియజేయ ప్రార్ధం!

జ : జోసెఫ్ పులిట్జర్ అమెరికన్‌ . ఇతని తండ్రి ధాన్యము , గోధుమల వర్తకము చేసేవాడు . పులిట్జర్ హంగేరిలో జన్మించి అమెరికాలోని పత్రికా ప్రపంచం  లో ప్రత్యేక స్థానము పొందాడు . దిన , వార పత్రిక అని ప్రచురించిన ఖ్యాతి ఈయనకి దక్కింది. తన దిన పత్రికలో అవినీతి గురించి చాలా ఘాటుగా విమర్శించి అక్షరయుద్ధం చేసిన మహనీయుడు .

పత్రికల్లో కాస్తంత హాస్యము , పాఠకులలో కుతూహలమురేపే  విషయాలు , సెన్సేషనల్ న్యూస్ - ఇలా దిన పత్రికలలో కొత్త వరవడికి శ్రీకారము చుట్టిన వ్యక్తి . పులిట్జర్ పత్రికలతో మమేకమై , పత్రికా వృత్తిని విపరీతముగా ప్రేమించాడు . నోబుల్ ప్రైజ్ కి ధీటుగా పులిట్జర్ ప్రైజ్ ఏర్పాటుచేసాడు.  పత్రికా సంపాదకునికో , సాహసవంతమైన విలేఖరుకో , ఏటా పులిట్జర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. నోబుల్ పైజ్ కు ఉన్నంత ఖ్యాతి , గౌరవం , విలువ ఈ పులిట్జర్ ప్రైజ్ కీ ఉన్నది.
  • 'పులిట్జర్' పురస్కారం
అమెరికాకు చెందిన ప్రచురణ కర్త జోసెఫ్ పులిట్జర్... పులిట్జర్ బహుమతిని నెలకొల్పాడు 'పులిట్జర్' బహుమానం అనేది ఒక అమెరికా పురస్కారం. ఈ పురష్కారాన్ని వార్తాపత్రికలు మరియు ఆన్‌లైను పత్రికారచన, సాహిత్యం మరియు సంగీత స్వర రచన రంగాలలో విశేష కృషి చేసినవారికి ప్రధానం చేస్తారు. అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...