ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?
జ : ఎంతో సాధన చేసినా మనిషి రెండు నిమిషాల కన్నా ఊపిరి బిగబట్టలేడు . ప్రతిక్షణము ఊపిరిసాగితేనే మనిషి జీవిస్తాడు . సాధారణముగా 30 సెకెండ్లు ఊపిరి ఆపుకోగలం . అది దాటిందా మెదడు స్పందించడం మొదలు పెడ్తుంది. , కళ్ళు తిరిగి నట్లు అవుతాయి. నీటమునిగి ఈత కొట్టేవారు సాధన ద్వారా కొంచం ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి ఉండగలరు .
ఊపిరి బిగపట్టడము మంచిది కాదు ... మెదడుకి రక్తం సరఫరా తగ్గి దెబ్బతింటుంది.
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...