Saturday, August 02, 2014

What is disinfection of water ,నీటి శుద్ధీకరణ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : What is disinfection of water ,నీటి శుద్ధీకరణ అంటే ఏమిటి?

Ans : నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు కలుషితము చేసే జీవావరణమును  తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్దతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్దతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.

నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, బాక్టీరియాని, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.

తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.

నీటిని చూచి పరిక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్దతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...