ప్ర : ఇంధనము అంటే ఏమిటి?
జ : శక్తిని ఇచ్చే ఏ పదార్ధమైనా ఇంధనమే . మనిషికి ఆహారము ఇంధనమే . ఐతే యంత్రాలు తిరిగేందుకు వాడే పదార్ధాలను ఇంధనం అంటారు.
ఇంధనము మండినపుడు ఉష్ణోగ్రత , కాంతి వస్తుంది . అవే శక్తిగా ఉపయోగపడతాయి. బొగ్గు అనేది భూమిలోపల పడిన చెట్లనుండి కుళ్ళిపోయి ఏర్పడినది. ఆ రీతిలో ఏర్పడినవే సహజవాయువు , ముడిచమురు వగైరాలు. ఇంధనము స్థితి ని బట్టి ఘన ,ద్రవ ,వాయు ఇంధనాలు అంటాము . ముఖ్యమైన ద్రవ ఇంధనాలు -- కిరోసిన్ , డీజిల్ , పెట్రోల్ . రాకెట్ లో ఘన ఇంధము , వంట చేసుకునేందుకు వాయుఇంధనము (సి.ఎన్.జి) లను వాడుతారు .
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...