Wednesday, August 13, 2014

What is ventilator using for patients-రోగులకు పెట్టే వెంటిలేటర్స్ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొంతమంది రోగులకు వెంటిలేటర్లు పెడుతుంటారు. అసలు వెంటిలేటర్‌ అంటే ఏమిటి?

జవాబు: ఇళ్లలో, కార్యాలయాల్లో వెలుతురు రావడానికి, లోపల గాలి బయటకు వెళ్లడానికి పెట్టే వెంటిలేటర్లు, మీరు ప్రస్తావించిన వెంటిలేటర్లు వేరు. మీరడిగిన వాటిని 'రెస్పిరేటర్లు' అని కూడా అంటారు. కృత్రిమ శ్వాసక్రియ (artificial respiration) కు ఉపకరించే యంత్ర పరికరాన్ని వైద్య పరిభాషలో వెంటిలేటరు లేదా రెస్పిరేటరు అంటారు. తీవ్రమైన ఆస్మా, విషాహారం, పురుగు మందులు తాగడం, విష సర్పపుకాటు, కోమా, తీవ్రమైన ఊపిరితిత్తుల జబ్బులు, మెదడు జబ్బులు తదితర అత్యవసర చికిత్సల సమయంలో రోగి తన సహజ పద్ధతిలో శ్వాస క్రియ జరుపలేడు. అటువంటి పరిస్థితుల్లో కృత్రిమ శ్వాస కల్పిస్తారు. ఈ వ్యవస్థనే వెంటిలేటర్‌ అంటారు.

సిలిండర్ల నుంచి గొట్టాల ద్వారా ఆక్సిజన్‌ను నిర్దిష్ట పద్ధతిలో ఊపిరి తిత్తుల్లోకి శ్వాస నాళం వరకు ప్రత్యేక ట్యూబుల ద్వారా పంపుతారు. అక్కడ విడుదలైన కార్బన్‌డై ఆక్సైడ్‌, నీటి ఆవిరిని తిరిగి బయటకి అదే ట్యూబు ద్వారా లాగుతారు. ఆక్సిజన్‌ను లోపలికి పంపే ఉచ్ఛ్వాస ప్రక్రియను కార్బన్‌డై ఆక్సైడ్‌ను బయటకు పంపే నిశ్వాస ప్రక్రియను కంప్యూటర్‌ ద్వారాగానీ, విద్యుత్తు పరికరాల ద్వారాగానీ ముషలకాల ద్వారా గానీ నెరవేర్చే ప్రక్రియ వెంటిలేటర్లలో ఉంటుంది. సాధారణ శాస్త్ర చికిత్స సమయంలో కూడా మత్తు మందును పంపడానికి మత్తులో ఉన్న రోగికి శ్వాసలో సహకరించడానికి కూడా వెంటిలేటర్‌ను వాడతారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...