ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?
Ans : తినడానికి బతకకూడదు ... బతకడానికి తినాలి... అని పూర్వము ఒక నానుడి. ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము అంటారు. . . ఆధునికులు . జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్ధము తో సంధానించి " అన్నం పరబ్రహ్మం" అన్నారు పెద్దలు. ఆహారమునుండే ఆరోగ్యము , అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు అంటారు . జీవరాసులన్నింటికీ ఏదోవిధమైన ఆహారము వాటి జీవనానికి అవసరము .. ఈ ఆహారము లో ఆరు రుచులు అని ఆయుర్వేదము చెపుతుంది. నిజానికి రుచులు అనేక రకాలు. జీవి-జీవికీ రుచి గ్రహణలో తేడాలు ఉంటాయి.
షడ్రుచులు ,Six-tastes
- తీపి-------Sweet. ఉదా: పంచదార , తేనె ,
- పులుపు---Sour. ఉదా : నారింజ , నిమ్మకాయ ,
- చేదు------Bitterness. ఉదా : వేప , పసుపు , మెంతులు ,
- కారం-----Recompence(chili). ఉదా : మిరప , మిరియాలు ,
- వగరు-----Acrid. ఉదా : చిక్కుడు , కాలీఫ్లవర్ , మినప పప్పు ,
- ఉప్పు-----Salt. ఉదా : సముద్రపు నీరు , సైందవ లవణము ,
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...