ప్రశ్న: ఒంటె పాలతో పెరుగు తయారవదు అంటారు. ఎందుకని?
జవాబు: పాలు పెరుగు కావడం అంటే అర్థం ఆ పాలలో ఉన్న లాక్టోజ్ అనే పిండి పదార్థం మీద ఈస్ట్ అనే బ్యాక్టీరియా దాడిచేయడమే. లాక్టోజ్ తన సమూహాల్ని పెంచుకునే క్రమంలో విడుదలైన ఆమ్ల గుణ లక్షణాలున్న రసాయనాల సమక్షంలో పాలు గడ్డకడతాయి. కాబట్టి పాలు పెరుగు కావడంలో ప్రధాన భూమిక లాక్టోజ్‌ది. ఒంటె పాలలో లాక్టోజ్ పరిమాణం తక్కువ ఉంటుంది. ఆమ్లగుణమున్న పదార్థాలమీద ఈస్ట్ ప్రభావం తక్కువ. మామూలు గేదెలు, ఆవులు, గొర్రెల పాలలో కన్నా ఒంటె పాలలో ఆమ్ల లక్షణమున్న c- విటమిన్ ఎక్కువ. పైగా ఖనిజ లవణాలు పాలూ ఒంటె పాలలో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈస్ట్ చేష్టలకు కష్టం కావడం వల్ల ఒంటె పాలు అంత తొందరగా పెరుగుగా మారవు. ఇందువల్లే దూరప్రయాణం చేసేవారు ఒంటెపాలు తమవెంట తీసుకెళతారు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...