ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మన శరీరములో కొత్త కణాలు పుడుతూ ఉంటాయా?.
జ : శరీరమంటేనే కణాల సముదాయము .ఇందులో ప్రతి కణానికీ మరణము ఉంటుంది. ఒక్కొక్క రకము కణానిది ఒక రకమైన ఆయుర్ధాయము . మనకు తెలియకుండానే మన శరీరములో కణాలు మరణించడము , వాటి స్థానము లో కొత్త కణాలు పుట్టుకురావడము జరుగుతుంటుంది . శరీరము లో దెబ్బతిన్న నాడీకణాల స్థానములో కొత్తవి రావడమే కస్థము . శరీరములోని ప్రతి కణానికీ నిర్ధిస్టమైన ఆయుర్ధాయము ఉంటుంది. ఆ కణము ఎలా ప్రవర్తించాలి , ఎటువంటి విధిని నిర్వర్తించాలి. ఎప్పుడు మరణించాలి అన్నది కణకేంద్రకము లో నమోదైవుంటుంది. కేంద్రకము లో ఉన్నటువంటి డి.ఎన్.ఎ . లోని సమాచారము ప్రకారమే కణ జీవితం అనేది నడుస్తూవుంటుంది.
పేగు పైపొర కణాలు ప్రతి 5 రోజులకు పాత వాటిస్థానములో కొత్తవి వస్తుంటాయి.
తెల్ల రక్తకణాలు 2 నుండి 4 సం.లు ,
ఎర్ర రక్త కణాలు 90-120 రోజులు లలో మృతిచెందుతాయి.,
మన చర్మము మీద ఉన్న కణాలు ప్రతి 15 నుండి 20 రోజులకొకసారి కొత్తవి వస్తుంటాయి.
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...