Saturday, July 12, 2014

తీరాల్లోనే ఇంధనాలు ఎక్కువేల ?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: Fuel available more on costal area Why?ఇంధనాలు సముద్ర తీరాల్లోనే ఎక్కువగా ఎందుకు లభిస్తాయి?

జవాబు: సముద్రాలు చాలా లోతుగానే ఉన్నా సముద్రపు అడుగు నేల మీద, ఆ నీళ్లలోను చాలా వృక్ష జాతులు నివసిస్తూ ఉంటాయి. అనేక జాతుల జల చరాలు అందులో జీవిస్తాయి. ఈ వృక్ష, జంతు జలచరాలు చనిపోయాక వాటి అవశేషాలు భూమ్యాకర్షణ వల్ల నేల అడుక్కు చేరతాయి. దాని వల్ల, సముద్రపు నీటి ఒత్తిడి వల్ల, ఆయా శరీరాలు చిన్నాభిన్నమై సన్నని ముక్కలుగా మారతాయి.అవి సముద్రపు అడుగు నుంచి తీరం వైపు ఉన్న నేల చరియల ద్వారా తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. అక్కడున్న భూగర్భంలో రసాయనిక విఘటనం చెంది పెట్రోలియం ద్రవంగా, సహజ వాయువుగా మారతాయి. ఇందువల్లే సముద్ర తీరాల్లో, ముఖ్యంగా నదులు సముద్రాల్లో కలిసే తీర ప్రాంతాల్లో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు బాగా విస్తారంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సముద్ర తీరంలో కృష్ణా, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే భాగంలో చాలా నిక్షేపాలున్నాయి.

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...