Thursday, July 24, 2014

What did tell by 4 directions in Science Architecture?,వాస్తు శాస్త్రములోనాలుగు దిశలు చెప్పేదేమిటి?.

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 What did tell by 4 directions in Science Architecture?,వాస్తు శాస్త్రములోనాలుగు దిశలు చెప్పేదేమిటి?.
    మన పూర్వీకులు తమ అపారమైన జ్ఞాన సంపద, అనుభవం.. సృష్టి పట్ల అవగాహనతో పలు శాస్త్రాలు రూపొందించారు. వాటిని సామాన్యులకు అపోసన పట్టడం సాధ్యం కాదు. అందుకే, వాటి సారాంశాన్ని క్లుప్లంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సామెతల రూపంలో వివరించారు.  అదేవిధంగా, నాలుగు దిశల గురించి క్రమబద్ధంగా తెలిపారు.

ఈశాన్య దిశలో గుంట అన్నారు. అంటే బావి లేక బోరు అన్నమాట. కొన్ని అవసరాల దృష్ట్యా నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా వేసవిలో నీటి కొరత అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ దిశలో సంపులు, నీటి నిల్వ కోసం భూమి లోపల ట్యాంకులను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ దిశలో శాస్త్రీయరీత్యా ఎక్కువ స్థలం వదలడం, ఇతర కట్టడాలు లేకపోవడం వలన.. కావాల్సినంత సూర్మరశ్మీ వీటిపై పడి నీరు కాలుష్యం కాకుండా ఉంచుతుంది. నేల కూడా పొడిగా ఉంటుంది.

ఆగ్నేయ దిశలో మంట అంటే వంటావార్పు అన్నమాట. వంట చేసేటప్పుడు పొయ్యి నుంచి వెలువడే ప్రమాదకరమైన వాయువులు, మసాల ఘాటు వంటివి బయటికి వెళ్లడానికి అనువుగా.. అటు దక్షిణ ఆగ్నేయంలోనూ ఇటు తూర్పు ఆగ్నేయంలోనూ కిటికీలు ఏర్పాటు చేసుకుంటే క్రాస్‌ వెంటిలేషన్‌ సజావుగా జరిగి ఇంటి ఇల్లాలికి, వంట చేసేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

వాయువ్య దిశలో పెంట పశువులను పెంచడం, కాలకృత్యాలు, స్నానాలు చేయడం, మరుగుదొడ్ల ఏర్పాటు వంటివి అన్నమాట. ఇక్కడ్నుంచి వెలువడే దుర్వాసనలు ఇంట్లోకి ప్రవేశించకుండా.. అట్నుంచి అటే బయటికి వెళ్లడానికి వీలుండేలా ఏర్పాట్లు చేసుకోవడానికి అనువుగా ఉండాలని ఇలా చెప్పారు.

నైరుతి దిశలో గుట్ట ఈ దిశలో మనక్కావాల్సిన వస్తువుల్ని భద్రపర్చుకోవాలని చెప్పారు. శాస్త్రీయరీత్యా ఇంటి యజమాని ఈ దిశలో ఉండాలని చెబుతుంటారు. కారణం.. దక్షిణం నుంచి వెలువడే గాలి ఆరోగ్యదాయకమని.. విలువైన సామాగ్రి, పత్రాలు వగైరా ఆ ఇంటి యజమానికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. మనిషికి ముఖ్యమైన వాటిలో నీటి తర్వాత గాలి అత్యంత అవసరం. అందుకే, పడమర నైరుతి, దక్షిణ నైరుతి పరిశుభ్రమైన గాలీ, వెలుతురు రావడానికి ఏర్పాటు చేసుకోవాలి. భద్రతపరంగా కూడా శాస్త్రీయరీత్యా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పైగా ఈ గదిలోకి అందరికి ప్రవేశముండదు. ఈ దిశలో బరువు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి.. చాలామంది నీటి నిల్వ చేసుకునే ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఇక్కడే ఏర్పాటు చేస్తుంటారు.
  • - పి.కృష్ణాదిశేషు,--వాస్తు ఇంజినీరు@eenadu news paper
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...