Thursday, July 24, 2014

How do animals know the directions,జంతువులకు దిశ తెలిసేదెలా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా?

జవాబు: వలస పక్షులు, పావురాలు, తాబేళ్లు, సొరచేపలు, తిమింగలాలు వంటివి పయనించే దిశ విషయంలో భూ అయస్కాంత క్షేత్రం (earth magnetic field) సహాయాన్ని తీసుకుంటాయి. ఈ ప్రాణులన్నీ అయస్కాంత కణాలు ఉండే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు అతి చిన్న ఇనుము లేక నికెల్‌ లోహ కణాల మయం. ఇవి అయస్కాంత సూచి (magnetic compass)లాగా పనిచేస్తాయి. ఏ ప్రాణిలోని ఏ జ్ఞానేంద్రియంలో ఈ అయస్కాంత కణాలు ఉంటాయో అనే విషయం ఇంకా కనిపెట్టవలసి ఉంది. ఆ జ్ఞానేంద్రియంలో జరిగే జీవరసాయన చర్యలను అవగాహన చేసుకొనే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి.


వలసపోయే పక్షుల విషయంలో ఈ అయస్కాంత సంబంధిత జ్ఞానం వాటి కుడికంటిలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా తెలిసింది. కుడికన్ను గ్రహించిన సమాచారం మెదడులోని ఎడమభాగంలో క్రమబద్ధీకరింపబడి, ఆ ఆలోచనతో కాంతి గ్రాహకాల (light sensors) ను ప్రేరేపించడం ద్వారా పక్షులు అయస్కాంత క్షేత్రాలను పసిగట్టగలుగుతాయి.

సొరచేపలలో ఈ అయస్కాంత ఇంద్రియం వాటి ముక్కులలో ఉంటుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను కనిపెట్టే అతి సున్నితమైన 'ఏరియల్‌'లాగా పనిచేస్తుంది. సొరచేపలు ఒక 'వోల్ట్‌' లోని పదిలక్షలవ వంతు విద్యుత్‌ పొటన్షియల్‌ను కూడా కనిపెట్టగలవన్నమాట. ఈ విధంగా పక్షులు, జంతువులు భూ అయస్కాంత క్షేత్ర ఉనికిని కనిపెట్టి దిశానిర్దేశం చేసుకోగలవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...