ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్' మనే శబ్దం వస్తుంది ఎందుకు?
జవాబు : కెటిల్‌లో నీరు పోసి స్టవ్ మీద పెడితే నీరు వేడెక్కేకొలదీ కెటిల్ కూని రాగాలు తీస్తుంది. స్టవ్ వెలిగించగానే మొదటగా కెటిల్ అట్టడుగు భాగంలో ఉన్న నీటి పొర వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరి బుడగల సాంద్రత, నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటంతో అవి పైకి లేస్తాయి. కింది పొరలో ఏర్పడిన బుడగలు పై పొరలలోని చల్లని నీటిని తాకడంతో సంకోచం చెంది చివరకు పూర్తిగా ముడుచుకుని పోతాయి. ఈ విధంగా ముడుచుకుపోయే అనేక నీటి ఆవిరి బుడగలు చేసే శబ్దమే కెటిల్ నుంచి వినిపించే 'హిస్' శబ్దం. ఈ బుడగల సంఖ్య పెరిగే కొలదీ శబ్దం కూడా ఎక్కువవుతుంది. కెటిల్‌లోని నీరంతా పూర్తిగా వేడెక్కి ఉష్ణోగ్రత బాష్ఫీభవన స్థానం చేరేటప్పటికి కెటిల్‌లో చల్లని పొరలు లేకపోవడంతో నీటి ఆవిరి బుడగలు సంకోచించడం ఆగిపోతుంది. దాంతో శబ్దం కూడా ఆగిపోతుంది. ఈ దశ తర్వాత కెటిల్‌లోని నీరు మొత్తం మరగడం ప్రారంభమవుతుంది.
- - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...