Thursday, October 22, 2015

భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


  •  
ప్రశ్న: భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?జవాబు: చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు చెమటను స్రవింపచేస్తూ ఉంటాయి. అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు గాలిలోకి ఆవిరైపోతూ ఉంటుంది. ఇలా ఆవిరవడం గాలిలోని నీటి శాతంపై అంటే తేమపై ఆధారపడి ఉంటుంది. తేమ శాతం తక్కువగా ఉంటే ఆవిరయ్యే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. అదే వర్షం వచ్చే ముందు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో అప్పటికే బోలెడు తేమ ఉండటం వల్ల ఇక ఏ మాత్రం తేమను అది ఇముడ్చుకోలేదు. అందువల్ల శరీరంపైకి చేరే చెమట ఆవిరి కాకుండా అక్కడే ఉండిపోతుంది. అపుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపించి చెమటలు కారిపోతాయన్నమాట.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ======================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...