Sunday, March 13, 2011

పప్పు లో ఆ పురుగులు ఎక్కడివి?, We see worms in dall of corked bottle-How?



ప్రశ్న: కుంకుమ, పసుపు, రవ్వ, పప్పు గింజలు ఉండే డబ్బాలను మూతపెట్టి ఉంచినా కొంతకాలానికి పురుగులు వస్తాయి. ఎలా?


జవాబు: వాతావరణంలో మనకు కనిపించకుండా ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. అలాగే కొన్ని జీవుల గుడ్లు కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో ఉండి గాలిలో తిరుగుతూ ఉంటాయి. మనం ఇంటికి తెచ్చుకునే దినుసుల్లో ఇలాంటి గుడ్లు చేరి ఉండే అవకాశం ఉంది. మూతపెట్టి ఉంచినా అనుకూల సమయం రాగానే ఆ గుడ్ల లోంచి పురుగులు బయటకి వస్తాయి. ఇంటికి తెచ్చుకోక ముందు కొన్ని దినుసులు తాజాగా ఉన్నప్పటికీ ఆయా డబ్బాలను తరచు తీసి వాడుతున్న సమయంలో సూక్ష్మజీవులు, గుడ్లు చేరే అవకాశం ఉంటుంది. అందువల్లనే దినుసులను వండుకునేప్పుడు మాత్రమే కాకుండా తరచు బాగు చేయడం, ఎండలో పెట్టడం వంటివి చేస్తుంటారు పెద్దలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక



  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...