Sunday, March 27, 2011

ఆడవారు సుకుమారులా?,Are women smooth in bodystrength?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును. అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం!.



ప్రశ్న: మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా?

-ఎ. భాస్కర్‌,
5వ తరగతి, మదర్‌ థెరిసా విద్యాలయం, గుబ్బగుర్తి (ఖమ్మం)

జవాబు: ప్రకృతి సహజంగా మగవారికి, ఆడవారికి కొన్ని తేడాలున్నా బలాబలాల్లోను, దృఢత్వంలోనూ పెద్ద తేడా ఉండదు. కానీ లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధమైన సహజ లక్షణాలకి తోడుగా సామాజికాంశాలు ప్రభావం చూపడం వల్ల ఆడవారి శరీర పరిమాణం మగవారి కన్నా చిన్నగా, నాజూకుగా తయారైంది. ఆ మేరకు ఆహార అవసరం కొంత తగ్గినా శ్రమ విషయంలో ఆడవారు తక్కువేమీ కాదు.

ప్రపంచవ్యాప్తంగా మానవాళి చేసే అన్ని రకాల సామాజిక, ఉత్పత్తి సంబంధ శ్రమలో ఆడవారి పాత్రే అరవై శాతంగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చూస్తే ఆహారపు అవసరం ఆడవారికే అధికం. కానీ సమకాలీన సామాజిక, సంస్కృతిక నేపథ్యం ఆడవారిని సన్నగా, నాజూగ్గా ఉండాలని ప్రేరేపిస్తోంది. ఇది ఫ్యాషన్‌ కాదు. ఏమైనా ఆడవారు మగవారి కన్నా దేహదారుఢ్యంలో అబలలు కారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...