Monday, December 10, 2012

Tears without weaping?-ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


Q : ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

A : కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో lacrimation అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది. చాలా జంతువులలో lacrimation కు అవుసరమైన వ్యవస్థ (శరీర భాగాలు, గ్రంధులు) ఉన్నాయి. అయితే భావోద్వేగాల కారణంగా ఇలా కన్నీరు కార్చే క్షీరదం జాతి జీవి... మానవుడే అని భావిస్తున్నారు.

కనురెప్పలు  కొట్టకుండా టెలివిజన్‌  లేదా కంఫ్యూటర్  తెరవైపు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇవి ఏడుపుకు సంబంధించి నవి కావు . కనుగుడ్డు తేమకోసము కంటి నీరు ఉత్పత్తి అవుతుంది.  కనురెప్పలు వేయడం ద్వారా ఆనీరు ఒక పలుచని పొరలాగా కనుగుడ్డు పైన విస్తరిస్తుంది . సాధారనము గా నిమిషానికి 10-12 సార్లు మూసి తెరిచే కనురెప్పలు దీక్షగా చూస్తున్నప్పుడు 3-4  సార్లే కొట్టుకోవడము వల్ల కనుగుడ్డు మీద తేమ విస్తరించక కన్నీళ్లుగా కిందికి కారుతాయి.
  • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...