ప్రశ్న: చెకుముకి రాయి నుంచి నిప్పు కణాలు ఎలా వస్తాయి?
జవాబు: చెకుముకి రాయి (Flint stone) మెరిసే నిప్పు కణాలను ఉత్పన్నం చేయడానికి గల కారణం దాని దృఢత్వమే. చెకుముకి రాయి తీవ్రంగా కొట్టగల సాధనమే కానీ నిప్పుకణాలు వెలువడేది మాత్రం ఇనుము, గంధకాల సమ్మేళనంతో కూడిన పైరైట్ (Pyrite) లేక స్టీలు లాంటి పదార్థాల నుండే రాతి యుగంలో నిప్పును పుట్టించడానికి పైరైట్ ముద్దను, ఎండుటాకులు పీచులాంటి పదార్థాలను ఒకచోట ఉంచి దానిపై దృఢమైన చెకుముకి రాయిని తాటించేవారు. మధ్యయుగంలోని పిస్తోళ్లలో చెకుముకి రాయిని, ఇనుమును తాటించడం వల్ల నిప్పు కణాలు వెలువడేవి. సిగరెట్ లైటర్లను చెకుముకి రాయితో చేయబడిన ఒక చక్రం అక్కడి మిశ్రమ లోహంపై ఘర్షణ కలిగించడంతో స్పల్పమైన మెరుపుతో కూడిన నిప్పు కణాలు వెలువడతాయి. ఆ కణాలు అందులో ఉండే పెట్రోలు, భాష్పం నుండి చిన్న మంట వచ్చేటట్లు చేస్తుంది. ఖరీదైన లైటర్లలో స్పార్క్‌లను ఉత్పన్నం చేయడానికి పీజో ఎలక్ట్రిక్ క్వార్ట్జ్ స్ఫటికాలను (Pieza electric quartz crystals) ఉపయోగిస్తారు.
- ప్రొ|| ఈ. వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...