ప్రశ్న: మడిచిన కాగితంపై పడే ముడతలను తొలగించలేము. ఎందువల్ల?
జవాబు: చదునుగా ఉన్న కాగితాన్ని రోలరులాగా చుట్టి వదిలితే, అది తిరిగి యధాస్థితికి వస్తుంది. అదే కాగితాన్ని మడత పెట్టి రుద్దితే, తిరిగి అది మునుపటి స్థితికి చేరుకోలేదు. కాగితం 'సెల్యులోజ్' పోగులతో కూడి ఉంటుంది. ఈ సెల్యులోజ్ కలప, గుడ్డ పేలికల గుజ్జు నుండి లభిస్తుంది. మెత్తగా, సున్నితంగా ఉండే ఈ పోగులను కొంచెంగా వంచవచ్చు. అందువల్లే కాగితాన్ని రోలర్‌లాగా చుడితే సెల్యులోజ్ పోగులు కొంచెం దగ్గరగా రావడం వల్ల
కాగితం వంగినా దాన్ని తిరిగి వెనుకకు చుట్టడం ద్వారా యధాస్థితికి వస్తుంది. అదే కాగితాన్ని మడతపెట్టినప్పుడు అందులోని సెల్యులోజ్ పోగులు విరగడమో, తెగిపోవడమో జరుగుతుంది. అందువల్ల మడత విప్పినా కాగితం యధాస్థితికి చేరుకోలేదు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...