Thursday, May 02, 2013

Can Animals and birds Predict Disaster?,జంతువులు, పక్షులు-ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగడతాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు, పక్షులు వాటిని తెలుసుకుంటాయంటారు. ఎలా పసిగడతాయి?

జవాబు : జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. అలాగని 2 సంవత్సరాల తర్వాతో, రెండు నెలల తర్వాతో రాబోయే వాటిని అవి కూడా గుర్తించలేవు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...