ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బ తగలదు. ఎందుకని?
జవాబు: ఏదైనా వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే. పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం(momentum)లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు 20 మీటర్ల ఎత్తు నుంచి పడిపోతూ 2 సెకన్లలో నేలను తాకిందనుకుందాం. ఈ ప్రయాణంలో అది సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని, దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల ద్రవ్యరాశి చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడుతాయి.
Courtesy with -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@ ఈనాడు దినపత్రిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...