ప్రశ్న: ట్యూబ్‌లైట్లను కరెంట్ ప్రవహించే తీగల కింద వాటికి తగలకుండా పెడితే, వాటంతట అవి ఎలా వెలుగుతాయి?
జవాబు: ట్యూబ్‌లైట్లు లేక ఫ్లోరసెంట్ ట్యూబ్‌ల గుండా విద్యుత్ శక్తిని ప్రవహింప చేస్తే, వాటిలో ఉండే వాయువుల అణువులు ఉత్సర్గం చెంది కంటికి కనబడని అతినీలలోహిత కాంతిని వెలువరిస్తాయి. ఈ అతి లోహిత కిరణాలు ఆ ట్యూబ్ గోడల లోపలి వైపు పూయబడిన పదార్థపు అణువులను ఉత్తేజ పరచడంతో కంటికి కనబడే కాంతి వెలువడుతుంది.
ట్యూబ్‌లైట్లను ఎలాంటి విద్యుత్ శక్తిని సరఫరా చేసే వ్యవస్థకు అనుసంధానించకుండా విద్యుత్ ప్రవహించే తీగల కింద కొంత దూరంలో సమాంతరంగా ఉంచితే, ఆ ట్యూబ్‌లైట్లు వెలుగుతాయి. కారణం విద్యుత్ ప్రవహించే తీగల చుట్టూ ఉండే విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల ట్యూబ్‌లైట్లలో ఉండే వాయువులు ఉత్తేజం(excite)పొంది ఆయనీకరణ(ionisation)ప్రక్రియ ద్వారా ఉత్సర్గం (dischange)చెందడంతో ఆ ట్యూబ్‌ల నుంచి కాంతి వెలువడుతుంది. అంటే ఆ ట్యూబ్‌లైట్లు వెలుగుతాయి
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...