Thursday, May 02, 2013

In vaccuum ball rotate like Earth?, బంతి శూన్యంలో భూమిలా గుండ్రంగా తిరుగుతుందా?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న:శూన్యం(vacuum)లో బంతిని వేస్తే అది కూడా భూమిలా గుండ్రంగా తిరుగుతుందా?

జవాబు: కేవలం గాలి లేకపోవడాన్నే శూన్యమనుకుంటే చంద్రుడు కూడా శూన్యంలోనే ఉన్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సాధారణంగా శూన్యం (అంతరిక్షం, space) అంటే ఏ క్షేత్ర ప్రభావం(field effect)లేని ప్రాంతం. అక్కడ గురుత్వాక్షర్షణ(gravity)ఉండదు. అలాంటి చోట బంతిని కాదుకదా, ఏ వస్తువును ఉంచినా అది ఉంచిన చోటే ఉంటుంది. ఒకవేళ కొంత బలంతో విసిరేస్తే అది చేతి నుంచి వదిలినపుడు ఎంత వేగంతో బయట పడిందో అంతే వేగం(uniform valocity)తో అలా పోతూనే ఉంటుంది. (తిరిగి ఎక్కడయినా ఇతర క్షేత్రాల ప్రభావంతో పడేంత వరకు). అయితే భూమ్యాకర్షణ పరిధిలో ఉన్న ఉపగ్రహాలు(satelites),అంతరిక్ష ప్రయోగ శాలలు (space stations)వంటి చోట్ల బంతిని విసిరేస్తే తప్పకుండా అది తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి చుట్టూ తిరుగుతుంది. కానీ బంతికి సరిపడా వేగాన్ని ఇవ్వాలి. ఇది భూమ్యాకర్షణ ఉన్న క్షేత్రంలో ఎంత ఎత్తున ఆ వస్తువు (బంతి) ఉందన్న దూరం మీద ఆధారపడి ఉంటుంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...