ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చంద్రుణ్ణి భూమి ఆకర్షిస్తుంటే, మరి చంద్రుడు భూమిపై ఎందుకు పడడు?
జవాబు: చెట్టు నుంచి రాలిన పండు భూమిపై పడడానికి కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం అని ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు ఐజాక్ న్యూటన్
17వ శతాబ్దంలో ప్రతిపాదించాడు. రాలే పండును భూమి ఆకర్షిస్తున్నట్లే చంద్రుణ్ణి కూడా భూమి ఆకర్షిస్తుందని న్యూటన్ ఆ రోజుల్లోనే సిద్ధాంతీకరించాడు. మరి భూమిపై చంద్రుడు ఎందుకు పడడం లేదన్న ప్రశ్నకు జవాబు కూడా ఆయనే చెప్పాడు. భూమి చంద్రుణ్ణి గురుత్వాకర్షణ బలంతో తనవైపుకు లాగుతుంటే, ఈ బలానికి లంబదిశలో చంద్రుడు కొంత వేగంతో పయనిస్తున్నాడు. ఈ చలనం వల్లే చంద్రుడు భూమిపై పడడం లేదు. ఒక వ్యక్తి కొంత నీరు ఉన్న బకెట్‌కు తాడుకట్టి తన చుట్టూ వృత్తాకార మార్గంలో కొంత వేగంతో తిప్పుతుంటే, అందులోని నీరు నేలపై పడదు. తిప్పేవేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, నీటితోపాటు బకెట్ కిందపడుతుంది. రోదసిలో ఎలాంటి ఘర్షణ(friction) ఉండక పోవడంతో, చంద్రుని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు.
అందువల్ల చంద్రుడు భూమిపై పడకుండా ఒక నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతూ నెలకోక పరిభ్రమణం చేస్తూ ఉన్నాడు.
-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...