Wednesday, May 08, 2013

How do make Bullet proof jackets?, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఎలా తయారు చేస్తారు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అంటారు. తుపాకీతో పేల్చినా ప్రమాదం ఉండని విధంగా వాటిని ఎలా తయారు చేస్తారు?

జవాబు: తుపాకీ పేల్చినప్పుడు దూసుకు వచ్చే బుల్లెట్‌ విపరీతమైన వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని తాకుతుంది. ఆ వేగం వల్ల ఏర్పడే శక్తివిధ్వంసాన్ని సృష్టిస్తుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్టు ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల దాన్ని తాకే తుపాకీగుండు యొక్క శక్తి ఒకే చోట కేంద్రీకృతమవకుండా నలుదిక్కులకు చెదిరిపోతుంది. అంతేకాకుండా ఆ జాకెట్‌కు తగలగానే తుపాకి గుండు ఆకారం కూడా మారిపోవడంతో ఒకవేళ ఆ తూటా ఆ కోటును దాటి దాన్ని ధరించిన వారికి తగిలినా లోతైన గాయం ఏర్పడదు.

బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను దృఢమైన స్టీలు పలకలతో తయారు చేస్తారు. కొన్ని మందు గుండు సామాగ్రులు(Ammunition) స్టీలు గుండా కూడా చొచ్చుకొని పోయేలా ఉండడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్లను కూడా మరింత దృధమైన పదార్థాలతో రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పింగాణీ, టిటానియం లాంటి తెలిక పదార్థాలతో చేసే సన్నటి పొరలు ఒకదానిపై ఒకటి ఉండేలా వీటిని చేస్తున్నారు. ఇవి స్టీలు జాకెట్ల కన్నా ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా తేలికగా కూడా ఉంటున్నాయి. ఈ పదార్థాలతో పాటు కెవ్‌లార్‌(Kevlar) అనే పదార్థం నుంచి తీసిన దృఢమైన పోగులతో వలలాగా అల్లుకుని ఉండేలా ఈ జాకెట్లను చేస్తారు. దీన్ని తాకే తుపాకీగుండు ఈ వలలో చిక్కుకొని తన శక్తిని, ఆకారాన్ని కోల్పోంతుంది. అందువల్ల దీన్ని ధరించిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగదు.


- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...