ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : కనురెప్పలు ఎందుకు కదులుతాయి ?
జ : మనిషి కనురెప్పలు కనుగుడ్డును రక్షించేందుకు ఏర్పడినవి. ప్రతి ఆరు సెకన్లకు ఒకసారి ఆ కనురెప్పలు కొట్టుకుంటాయి. కనుర్ప్పలు కొట్టుకున్నప్పుడల్లా కంటిచివర ఉండే కన్నీటి గ్రండి నుండి నీరు వస్తుంది. ఆనీరు కనుగుడ్డును కడిగినట్టు చేసి తేమగా ఉంచుతుంది. కనుగుడ్డు ఎండిపోతే కంటిచూపు సమస్యలు వస్తాయి. కన్ను ఆరోగ్యముగా పనిచేయడానికి కనురెప్పలు పైకి కిందికి కదలడమే కారణం .
కంటి రెప్పలు రెపరెపలాడడం కంటిని కాపాడడం కోసమే. కంటి రెప్పలను ఆర్పడం అనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన
అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైంది. సున్నితమైంది. కంటిరెప్పలు రెపరెపలాడడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు కంటిలో పడకుండా రక్షణ కలుగుతుంది. కంటిరెప్ప పడినపుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటిలోపల ఉండే చిన్న గ్రంథిలో నుంచి స్రవించే ఈ నీటినే మనం 'కన్నీరు' అంటాం. ఈ నీటి తెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. అవి ముందు కంటి కొలికిలోకి చేరే విధంగా రెప్పల చివర ఉన్న వెంట్రుకలు సహకరిస్తాయి. రెప్పలు ఆర్పకుండా ఎక్కువ సేపు చూడడానికి ప్రయత్నిస్తే రెప్పలలోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దాన్ని అధిగమించడానికి రెప్పలు అసంకల్పితంగా రెపరెపలాడతాయి.
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...