రశ్న: ఓజోన్ పొర ఎక్కడుంటుంది? మన కంటికి కనపడదా?
జవాబు: ఓజోన్ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువు (triatomic oxygen molucule). ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్ అణువులో (diatomic oxygen molucule) మాత్రం రెండు పరమాణువులూ ఒకే విధమైనవి. తద్వారా సాధారణ ఆక్సిజన్ అణువుల్లాగా ఓజోన్ స్థిరమైన వాయువు (stable gas) కాదు. భూవాతావరణాన్ని నేల మీద నుంచి పైకి వెళ్లే కొలదీ అక్కడున్న ప్రధాన రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20 కి.మీ.లోపే ఉన్న పొరను ట్రోపోస్ఫియర్ అనీ, 20 నుంచి 50 కి.మీ మధ్యలో ఉన్న పొరను స్ట్రాటోస్ఫియర్ అనీ, ఆ తర్వాత మీసో స్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అనే పొరలు సుమారు 500 కి.మీ. వరకు వివిధ దూరాల్లో విస్తరించి ఉన్నాయి. మన సాధారణ ఆక్సిజన్ అణువులు స్ట్రాటో స్ఫియర్‌లో ఓజోన్ అణువులుగా మారతాయి. మూడు అణువుల సాధారణ ఆక్సిజన్ వాయువు రెండు అణువుల ఓజోన్‌గా ఇక్కడ రూపొందుతుంది. ఇందు కోసం ఆక్సిజన్ అణువులు చాలా శక్తిమంతమైన అతినీలలోహిత కాంతి ( 150to 215 nm తరంగదైర్ఘ్యం)ని వాడుకుంటాయి. అపుడు ఏర్పడ్డ ఓజోన్ కూడా చాలా కాలం ఉండలేదు. ఇది రసాయనికంగా స్థిరంలేనిది కాబట్టి త్వరగా తిరిగి ఆక్సిజన్‌గా మారుతుంది. క్రమంలో అది 215 నుంచి 315 nm తరంగధైర్ఘ్యం ఉన్న సౌరకాంతిలోని అతినీల లోహిత కిరణాల్ని వాడుకుంటుంది. అందుకే ఓజోన్ పొరను ప్రమాదకర అతినీలలోహిత కాంతి నుంచి భూమిని కాపాడే గొడుగు అంటాము. ఓజోన్ అణువు చాలా చిన్నది కావడం వల్ల, అది వాయురూపంలో ఉండటం వల్ల దానిని మనం చూడలేం. ఇది దాదాపు పారదర్శకంగా ఉంటుంది.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...