ప్రశ్న :
పాలు విరుగుతాయెందుకు?
జవాబు :
రసాయనశాస్త్రము ప్రకారము పాలు అష్తిరమైన కొల్లాయిడ్స్ రూపము . పాలలో పోషక పదార్ధాలైన ప్రోటీన్లు , విటమిన్లు తోపాటు మిక్రోమాలిక్యూల్స్ ఉంటాయి. ఇతువంటి కొల్లాయిడ్ పదార్ధాలను వేడిచేసినపుడు అందులోవున్న పెద్ద అణువులు దగ్గరకు చేరి పీలికల్లా గడ్డలా తయారవుతాయి . అలా యేర్పడడాన్ని విరగడం అంటాం .కొల్లాయిడ్ స్థితిలో ఉన్న పాలు విరగడానికి పులుపు వంటి పదార్ధములు జోడవడము ఒక కారణము . ఎక్కువ సమయము నిలువా ఉన్నా పాలు విరుగుతాయి.పాలు పి.ఎచ్ (ph) మారడము వలన ఇలా జరుగుతుంది . పాలు ఎసిడిక్ పి.ఎచ్ వైపు మారినపుడు వాటి అనువులు అమరిక తేడా అవడము మూలంగా పీలికల్లా గడ్డలు గా తయారవుతుండి
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...