Saturday, September 14, 2013

What are comets?,తోకచుక్కలు అంటే ఏమిటి?








ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

తోకచుక్కలు అంటే ఏమిటి?, comet-a celestial body generally with a tail?

తోకచుక్కలు నవగ్రహాలు మాదిరిగానే సూర్యునిచుట్టూ ప్రదక్షిణలు చేసే ఖగోళ వస్తువులు. అండ, వృత్తాకార కక్ష్యలో ఇవి తిరుగుతుంటాయి. సూర్యునిచుట్టూ తిరగడానికి కొన్నిటికి దశాబ్దాలు పడితే, మరి కొన్నింటికి అనేక శతాబ్దాలు కూడా పడుతుంది.తోకచుక్కలు తిరిగే కక్ష్యలు బహుదీర్ఘమైన అండవృత్తాలు కాబట్టి సూర్యుని నుంచి వాటి దూరం హెచ్చుగా, తగ్గుతూ ఉంటుంది. సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు ఇవి ఫ్లూటో కక్ష్యని దాటిపోవచ్చు. దగ్గరగా వచ్చినప్పుడు బుధగ్రహం కన్నా దగ్గరగా రావచ్చు.

తోకచుక్క సూర్యునికి బహుదూరంగా ఉన్నప్పుడు కనిపించీ కనిపించనంత చిన్న కాంతిబిందువులాగ ఉంటుంది. అప్పుడు దానికి తోక ఉండదు. తలమాత్రమే ఉంటుంది.ఆ తల భూమి కన్నా పెద్ద సైజులో అనేక వేల మైళ్ళ వ్యాసం కలిగి ఉంటుంది. అందులో రకరకాల సైజులలో రాళ్లూ, రప్పలు, దుమ్ము, ధూళీ వివిధ వాయువులుఉంటాయి. అవి భూమిలాగ దగ్గరగా, దట్టంగా నొక్కుకుని గాక, వదులుగా పలుచగా విస్తరించి ఉంటాయి. దాని మొత్తం బరువులో వెయ్యో వంతు లేక అంతకన్నా తక్కువగా ఉంటుంది. అండ, వృత్త కక్ష్యలో ప్రయాణం చేస్తున్న తోకచుక్క క్రమక్రమంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్య తేజస్సు తాకిడికి తోకచుక్కలో వదులువదులుగా ఉన్న పదార్థాలు దూరంగా తోసివేయబడి, చిన్నతోకలాగ ఏర్పడుతుంది. బరువైన పెద్దపెద్దరాళ్ళు, కొండలు మాత్రం దూరంగా పోక గుండ్రని తలకాయలాగ ఏర్పడతాయి. సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ దాని తోక అంతకంతకూ పొడవు అవుతూ ఉంటుంది. తోక పొడవు ఒక్కొక్క తోకచుక్కకి ఒకలా ఉంటుంది . అయితే ఇవి ఎలా పుట్టాయి , ఎందుకు పుట్టాయి అనేది ఇంకా స్పస్టము గా తెలియదు .

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...