Life time of Camera , Battery ,smart phone , Telivison?
ప్ర : కెమేరా ,బ్యాటరీ ,స్మార్ట్ ఫోన్, టెలివిజన్ వాడకకాలము ఎంతఉంటుంది?
జ : కెమేరా,బ్యాటరీ,స్మార్ట్ ఫోన్, టెలివిజన్ మన్నిక వాడకాన్ని అనుసరించి ఉంటుంది. వాటిగురించి అవగాహన ఉన్నప్పుడు లైఫ్-స్పాన్ ఏవిమముా ఉంటుందో అర్ధముకాగలదు .
కెమెరా : దీని లైఫ్-స్పాన్ క్లిక్స్ లేదా షట్టర్ లైఫ్ అంచనాల్ని బట్తి ఉంటుంది. చాలాభాగము నాణ్యమైన కెమెరాల జీవితలaము 50,000 క్లిక్స్ ఉంటుంది .మరింత మంచిదైతే 1,00,000 క్లిక్స్ దాకా ఉండొచ్చు.ఎంత ఎక్కువ వాడినా 5 ఏళ్ళు పాటు మన్నికగా ఉంటాయి.
బ్యాటరీ : ఏ పరికరానికైనా బ్యాటరీ గుండెకాయ వంటిది . అయితే అవి కొన్ని సంఖ్యల డిశ్చార్జి సైకిల్స్ కు పరిమితము అవుతాయి. కొన్ని నిర్ధిస్టమైన సైకిల తర్వాత ఈ బ్యాటరీలు పూర్తిష్థాయి లో పనిచేయవు . చాలా కంపెనీల బ్యాటరీలకు 5,000 (ఐదు వేలు ) ఉంటుంటాయి. అయితే ఓవర్ చార్జింగ్ చేయడము లేదా అవడము వలన వాటి జీవితకాలము తగ్గిపోతుంది. అందుకే కొన్ని బ్యాటరీలకు ఆటోకట్ రీచార్జ్ ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడూ కూడా పూర్తిగా డిశ్చార్జి అయ్యేదాకా వేచి చూడక ముందే చార్జ్ చేసుకోవాలి . 100% చార్జ్ అయ్యేక రీచార్జర్ డిస్ కనెక్ట్ చేసెయ్యాలి.
స్మార్ట్ ఫోన్ : సర్వేల ప్రకారము అమెరికాలో ఫోన్ జీవితకాలము 21 నెలలు . మనదేశములో దుమ్ము , ధూళి దృష్ట్యా అది 18 నెలలు గా నిర్ధారించబడినది. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తున్నందున చాలామంది ఫోన్లు పూర్తికాలము వాడడములేదు. ప్రొటెక్టివ్ కవర్లు వాడుతుంటే దుమ్ము నించి కాపాడుకోవచ్చు.
టివీలు : ఎల్.సి.డి , ఎల్.ఇ.డి , ప్లస్మా టెలివిజన్ల జీవితకాలము వాటి ప్యానెల్ ఎన్ని గంటలు పనిచేస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది . సాధారణము గా కంపెనీలు తమ ఉత్పత్తులు 30,000 గంటలు నుండి 1,00,000 గంటలదాకా పనిచేసేలా యేర్పాటు చేస్తారు. అయితే దీనర్ధము ఆ తరువాత పనిచేయవని కావు ... కొద్దికొద్దిగా డల్ అవుతాయి. బ్రైట్నెస్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే అవసరము లేనప్పుడు టి.వి.ని ఆఫ్ చేయడము ద్వారా జీవితకాలము లేదా బ్రైట్నెస్ కాపాడుకోవచ్చుని.
- ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...