Monday, September 09, 2013

షోడశ సంస్కారాలు తెలపండి ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమాజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై  ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
  మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది సాంస్కృతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.

   మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది.


ప్ర :
 షోడశ సంస్కారాలు తెలపండి ?

జ :
షోడశ సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు . అవి ఏమనగా ............
  1. అధానము ,
  2. పుంసవనము , 
  3. సీమంతము ,
  4. జాతకర్మము , 
  5. నామకరణము , 
  6. అన్న ప్రాసనము ,
  7. చౌలము , 
  8. ఉపనయనము , 
  9. ప్రాజాపత్యము ,
  10. సౌమ్యము ,
  11. ఆగ్నేయము, 
  12. వైశ్వదేవము , 
  13. గోదానము ,
  14. సమావర్తనము ,
  15. వివాహము ,
  16. అంత్యకర్మ , 
పుంసవనం
 ఈ పుంసవనము వలన లోపల గర్భములో వున్నటువంటి గర్భస్థ శిశువునకు శుద్ధి జరుగుతుంది.  ఈ పుంసవము చేస్తే మగ పిల్లవాడు పుడతాడని అనుకుంటూ వుంటారు. ఇది కేవలం గర్భస్థ శిశువుకు శుద్ధి జరుగుతుంది.
  • ============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...