Monday, September 23, 2013

How can we hear in cardles phones?,మాటలు ఎలా వినిపిస్తాయి?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది?

జవాబు: వైర్‌లెస్‌ ఫోన్లను కార్డ్‌లెస్‌ ఫోన్లు అని కూడా అంటారు. వింటూ, మాట్లాడే హేండ్‌సెట్‌కు మనం నంబరు డయల్‌ చేసే బేస్‌సెట్‌కు మధ్య విద్యుత్‌ తీగ ( wire or cord) ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్‌సెట్‌నుంచి దూరంగా హేండ్‌సెట్‌ను పట్టుకుని గదిలో మనం అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్‌లెస్‌ ఫోను అంటారు. ఇందులో హేండ్‌సెట్‌కు, బేస్‌సెట్‌కు మధ్య రేడియో తరంగాల ద్వారాగానీ, సూక్ష్మతరంగాల ద్వారాగానీ సమాచార రవాణా డిజిటల్‌ పద్ధతి అనే ఎలక్ట్రానిక్‌ ప్రక్రియ ద్వారా వీలవుతుంది. అందుకే హేండ్‌సెట్‌లోను, బేస్‌సెట్‌లోను రెంటిలో విద్యుచ్ఛక్తిని ఇచ్చే బ్యాటరీ ఉండాలి. సాధారణంగా బేస్‌సెట్‌ను ఏదైనా అడాప్టర్‌ (adopter)ద్వారా ఇంట్లో స్విచ్‌ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్తు (dc)ని అందిస్తారు. హేండ్‌సెట్‌లో రీఛార్జబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇందులోని బ్యాటరీలలో విద్యుత్‌ శక్తి తగ్గినపుడు తిరిగి రీఛార్జి చేసుకోవచ్చు. బేస్‌సెట్‌కే సెల్‌ఫోన్‌ వైరును కలపడం వల్ల అక్కడ్నించి మనం మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి అవతలి వ్యక్తికి చేరతాయి.
మైక్రోఫోను అనే మైకును వైర్లు ఉన్నా లేకున్నా మైక్రోఫోను అనే అంటారు. కార్డ్‌లెస్‌ ఫోను పద్ధతిలోనే మైక్రో ఫోనును ఉపయోగించగలిగితే అపుడు దాన్ని కార్డ్‌లెస్‌ మైక్రోఫోను లేదా కార్డ్‌లెస్‌ అనడం కద్దు. మనం మాట్లాడిన మాటలు తొలుత విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారతాయి. ఆ తర్వాత అవి రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్‌ తరంగాలుగా మారి స్పీకర్లకు అందించే ఆంప్లిఫియర్‌ దగ్గర ఉన్న బేస్‌ స్టేషను అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని చేరతాయి. అక్కడ అవి తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...