Tuesday, June 21, 2011

ఉగాది నాడు చేసే దశవిధ కృత్యాలు వివరాలు ఏమిటి ? ,What are Ten types human duties on UGADI .

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఉగాది పండుగ నాడు దశవిధ కృత్యాలు ను ఆచరించాలి . అవి -->
  1. ప్రతిగృహధ్వజారోహణము--కేవలం మహారాస్త్రం లోనే చూడగలము .,
  2. తైలాభ్యంగము - నూనె శరీరాని పట్టించి స్నానము చేయడం --అరోగ్యసూత్రాలలో ఒకటి ,
  3. చత్రచామర స్వీకారము -- ముంబై ,కలకత్తా ప్రాంతీయులు కొత్త గొడుగు , విసనకర్ర కొంటారు .,
  4. దమనేన బ్రహ్మపూజ్యము -సువాసనాబరితమైన పత్రాలతో పదిమంది దేవతా మూర్తులను పదిరోజులు పూజిస్తారు .,
  5. సర్వా పచ్చాంతికర మహాశాంతి--విఘ్నేశ్వరుని , నవగ్రహాలు ను పూజిస్తారు . ,
  6. నింభపుష్ప (వేపపువ్వు ) భక్షణం --వేప పచ్చడిని తినడం ,
  7. పంచాంగపూజ -శ్రవణము - - పంచాంగ శ్రవణము ... మంచి చెడులను తెలుకోవడం ,
  8. ప్రపాదాన ప్రారంభం -- చలివేంద్రాలను ప్రారంభించి దాహార్తులకు మంచినీటిని దానము చేయడం.,
  9. రాజస్నేహ దర్శనము -- ఈ కాలము లో రాజులేరు అందువల రాజకీయ నాయకులను , స్నేహుతల దర్శనము చేయడం .,
  10. వాసంత నవరాత్ర కలశ పూజ - భగవంతుని -- మన ఇస్టదైవాన్ని పూజించడం ,
ఈ పది ఉగాది విధి-విధాయక కృత్యాలు -- ఇవన్నీ నమ్మకాలే . మన పూర్వీకులు చేసేవారు ... మనమూ చేస్తున్నాము . కొనీ కాలగర్భము లో కలిసిపోయాయి. కొన్ని పనులు మాత్రము అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి . ఏది చేసినా ఎక్కడ చేసినా మనిషి సుఖజీవనానికి అవసరమైం ధనము కావాలి . వస్తుమార్పిడి విధానము పోయి ... ధనమార్పిడి విధానము లో దబ్బు కీలక పాత్ర పోషిస్తూఉన్నది . ఈ పూజలన్ని దానికోసమే . అందుకే అన్నారు ' ధనమేరా అన్నిటికీ మూలము ' ఒక మహానుభావుడు .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...