Thursday, June 30, 2011

పతివ్రతము అంటే ఏమిటి?, What is ment by worshiping husband?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : మన పురాణాలలో పతివ్రతులు అని అంటారు కదా! పతివ్రతం అంటే ఏమిటి ? ఎలా చేయాలి?.
జ : పతి అంటే భర్త , సతి అంటే భార్య . పతివ్రతం అంటే భర్తపూజ .

‘‘పతివ్రతము’’ అనే పేరుతో స్ర్తి ధర్మాలలో శిఖరాయమాణమైన ధర్మంగా, శాస్త్రాలలో ఏది ఉద్ఘోషింపబడి వుందో, అది స్త్రీ చే ఆచరించబడి గడిపే జీవితమే పతివ్రతము . ఇక్కడ వ్రతము అంటే పూజ / నోమూ కాదు . భర్త కి అనుకూలము గా , అవసరాలు తీరుస్తూ, చేదోడువాదోడు గా, అడుగుజాడలలో నడుచుకుంటూ గడిపే భార్య నే పతివ్రత అంటారు . ఆ జీవితాన్నే ఒక వ్రతము గా పూర్వము మునులు , ఋషులు అభివర్ణించారు . ఆటు వంటి స్త్రీలకు దేవతల అనుగ్ర హము ఉంటుంది. వారు దేవతలతో సమానము .

ఆర్తార్తే ముదితే హృష్టా
ప్రోష్తి మలినా కృశా
మృతే మ్రియేత యా నారీ
సా స్ర్తి జ్ఞేయా పతివ్రతా॥

(తా॥ భర్త బాధపడుతుంటే తనూ బాధపడుతుంది. అతను సంతోషంగా వుంటే తనూ సంతోషంగా వుంటుంది. అతను ఊళ్లో లేకపోతే కళతప్పి చిక్కిపోతుంది. అతను మరణిస్తే తనూ మరణిస్తుంది. అలా వుండే స్ర్తియే పతివ్రత).

-- కుప్పా వేంకట కృష్ణమూర్తి (దత్త జననం -167)
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...