Saturday, December 21, 2013

Parvas in Mhabharatam,మహాభారతం లో పర్వాలు

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మహాభారతం లో పర్వాలు ఎన్ని అవి ఏవి ? (సుందరరావు పట్నాయిక్ - శ్రీకాకులం టౌన్‌)
జ : మహాభారత కథ ని శౌనకాది మునులకి సత్రయాగం చేస్తుండగా అక్కడికి వచ్చిన రోణమహర్షి కుమారుడున్ను, మంచి కథకుడున్ను అయిన ఉగ్రశ్రవుడు వినిపించాడు. ఉగ్రశ్రవుడు మంచి పురాణ కథకుడు కాబట్టి ఏదైనా మంచి ఇతిహాసం చెప్పమంటే మహాభారతం చెప్పాడు.

ఈ మహాభరతంన్ని .............
ధర్మశాస్త్రం తెలిసినవారు ధర్మశాస్త్రం అనిన్ని,
నీతి విషయాలలో నేర్పు కలిగినవారు నీతిశాస్త్రం అనిన్ని,
పరమాత్మా, జీవాత్మ తారతమ్యం తెలిసిన వారు వేదాంత శాస్త్రం అనిన్ని,
కవిశ్రేష్టులు గొప్ప కావ్యం అనిన్ని, పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసం అని ప్రశంసించారు.

ఇందులో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి!
1. ఆదిపర్వం,
2. సభాపర్వం,
3. అరణ్యపర్వం,
4. విరాట పర్వం,
5. ఉద్యోగపర్వం
6. భీష్మపర్వం,
7. ద్రోణ పర్వం,
8. కర్ణపర్వం,
9. శల్యపర్వం
10. సౌత్పిక పర్వం,
11. స్త్రీపర్వం,
12. శాంతిపర్వం,
13. ఆనుశాసానిక పర్వం,
14, అశ్వమేధపర్వం,
15. ఆశ్రమవాస పర్వం,
16. మౌసల పర్వం,
17. మహాప్రస్థానిక పర్వం,
18. స్వర్గారోహణ పర్వం..
ఇవి కాక సంస్కృత భారతంలో హరివంశ పర్వం, భవిష్య పర్వం వున్నాయి కాని నన్నయ్య గారు ఆ రెంటిని ఆంద్ర మహాభారతంలో చేర్చలేదు. నన్నయ్య కొనసాగించిన ఆచారాన్నే తిక్కన్న , ఎర్రన్న కొనసాగించారు.. ఐతే ఎర్రన హరివంశ పర్వంలోనే భవిష్య పురాణం చేర్చి హరివంశం పేరుతొ ప్రత్యేకంగా గ్రంధం రచించాడు.

మహాభారతం లో మొత్తం 18 పర్వాలు  కలిపి ఉపపర్వాలతో మొత్తం 100 పర్వాలు ఉన్నాయి.. ఆంద్ర మహాహరతంలో మొత్తం 63 అశ్వాసాలు ఉన్నాయి. ఇందులో (తెలుగులో)21,507 పదగధ్యాలు , సంస్కృతంలో 1,00,500 శ్లోకాలతో మహాభారతం రచించారు.

Courtesy with : http://mahabharatamblog.blogspot.in/Sri Krishna.

  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 07, 2013

Is Sun mass decreasing?,సూర్యుని ద్రవ్యరాశి తగ్గుతుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుడు కాలం గడిచే కొలదీ తనలోని ద్రవ్యరాశిని కోల్పోతున్నాడా?

జవాబు: ప్రతి సెకనుకు సూర్యునిలో 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. దాని వల్లే సూర్యుడు కాంతి, ఉష్ణాలను వెదజల్లుతున్నాడు. దాంతో కాలం గడిచే కొలదీ సూర్యుని ద్రవ్యరాశి తగ్గి తేలికవుతున్నాడు. సూర్యుని అంతరాళాల్లో జరుగుతున్న కేంద్రక సంయోగ చర్య వల్ల నాలుగు హైడ్రోజన్‌ పరమాణువులు ఒక హీలియం పరమాణుగా మారుతుంటాయి. ఒక హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్‌ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ. అంటే హైడ్రోజన్‌ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి, శక్తిగా మారుతుందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన E= mc2 ద్వారా లెక్కకట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతివేగం. ఈ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవితకాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!

- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How Snakes and cockroaches protect Environment?,పాములు.బొద్దింకలు పర్యావరణానికి ఏవిధంగా దోహదకారులవుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాములు, బొద్దింకలు ప్రకృతిలో పర్యావరణానికి ఏ విధంగా దోహదకారులవుతున్నాయి?

జవాబు: ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకు భూమి తర్వాత మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కానరాలేదు. భూమ్మీద జీవం ఆవిర్భవించి సుమారు 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల రకాల వృక్ష జాతులు, వేలాదిగా జంతుజాతులు ఈ భూమ్మీద పరిణామం చెంది పర్యావరణానికి అనుకూలంగా ప్రకృతివరణం (Natural selection) ప్రకారం జీవనం సాగిస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, ఘర్షించుకుంటూ, సహజీవనం సాగిస్తూ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయగలుగుతున్నాయి. ప్రకృతినెదిరించే సామర్థ్యం జంతువులకు, వృక్షాలకు లేదు. కానీ మానవుడికున్న తెలివి, అవసరాల కారణంగా ప్రకృతిని ఎదురించి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యంలో తేడాలు సంభవిస్తున్నాయి. విపరీతమైన పట్టణీకరణ, జల ప్రణాళికల వల్ల ఎలుకలు, కప్పలు, పాములు, బొద్దింకలు పిచ్చుకలు, గాడిదలు, నక్కలు, రాబందులు, పులులవంటి పలు జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బొద్దింకలు పలు రకాల మురికి పదార్థాలు తినికూడా బతుకుతాయి. ఒక అంచనా ప్రకారం అత్యంత స్వల్పంగా పరిణామం చెందిన అతి పురాతన జీవి బొద్దింక. ఎందుకంటే దాని జీవన విధానం ప్రకృతి ఆటుపోట్లను తట్టుకోగలగడమే కారణమంటున్నారు. పంటల్ని, ధాన్యాన్ని తినే ఎలుకల్ని భక్షించేవే పాములు. పాముల్లో ఎన్నో రకాలున్నా నేలమీద సంచరించే పాముల్లో మూడు మాత్రమే విషసర్పాలు. కానీ మనం అన్నింటినీ భయంతో చంపుతున్నాం. కానీ పాములు, బొద్దింకలు కూడా ప్రకృతికి అవసరమే.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  •  ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Low pressure and Storm.How they form?,అల్పపీడనం.హరికేన్‌ అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: అల్పపీడనం అంటే ఏమిటి? హరికేన్‌ ఎలా ఏర్పడుతుంది?

జవాబు : గాలులు ఎక్కువగా గుమిగూడి ఉండే చోట అధిక పీడనం ఉంటుందనీ, పల్చగా ఉంటే ఆ ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం తిరుగుతుండడం వల్ల ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు వాతావరణంలో నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. వేడిగాలులు పైకి లేచిన చోట అల్పపీడనం ఏర్పడితే, ఆ ప్రదేశంలోకి చల్లని గాలులు వేగంగా వచ్చి చేరుతాయి. ఈ గాలుల ఒరవడిలో ఒకోసారి సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలుల పరిభ్రమణ వేగం ఎక్కువై, పెద్ద పరిమాణంలో గాలులు పోగవడం, పైకి వెళ్లే గాలులు ఎక్కువగా చల్లబడి పెద్దపెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి.

అల్పపీడనం ఏర్పడ్డ ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువైతే, దాన్ని వాయుగుండం అంటారు. అది కూడా బలపడితే తుపాను ఏర్పడుతుంది. అల్పపీడనాలు భూమ్మీద కూడా ఏర్పడవచ్చు. కానీ తుపానులు మాత్రం సముద్రంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే అక్కడ గాలులకు కొండలు, భవనాలు వంటి అవరోధాలు ఉండవు కదా! అడ్డూ అదుపు లేని గాలులు అక్కడ సుడులు తిరుగుతూ కేంద్రీకృతమైపోతూ పెద్దవిగా మారిపోతాయి. మామూలుగా సూర్యుని కాంతితో సముద్రపు ఉపరితలాలు వేడెక్కడం వల్ల అక్కడ దాదాపు పదికిలోమీటర్ల ఎత్తు వరకు నీటి ఆవిరి పొరలుగా పేర్కొని ఉంటుంది. అల్పపీడనాలు ఏర్పడినపుడు ఈ నీటి ఆవిరి అంతా దానిచుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ పరిణామం బాగా బలపడితే అదే హరికేన్‌ అన్నమాట. హరికేన్‌ ఏర్పడినచోట ఒక్కోసారి సముద్రంలోని నీరు ఎవరో స్ట్రాపెట్టి పీల్చినట్టు పైకిలేస్తుంది. అలా లేచిన అల పెద్ద నీటి గొడుగులాగా 24 అడుగుల ఎత్తు వరకు కూడా లేచి వేగంగా ప్రయాణించి తీరాన్ని ముంచెత్తే అవకాశం ఉంటుంది. దీన్నే ఉప్పెన అంటారు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do animals have horns and how they formed?,జంతువులకు కొమ్ములుంటాయెందికు ? అవిఎలా ఏర్పడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : జంతువులకు కొమ్ములుంటాయెందికు ? అవిఎలా ఏర్పడతాయి?

జ : నాలుగు కాళ్ళ మీద నడిచే ఎద్దులు , గేదెలు , జింకలు వంటివాటన్నింటికీ కొమ్ములు ఉంటాయి . నిర్మాణపరంగా తేడాలు ఉన్నప్పటికీ కొమ్ములు రక్షణ కోసం నిర్దేశించినవి . ఎద్దులు , గేదెలు కొమ్ములు మార్పు చెందిన రోమాలు . అవి బలమైనవిగా రూపొందాయి. లోపల గుల్లగా ఉన్నా గట్టిగా ఉండి మొనతేలివున్నందున రక్షించుకునేసమయములో దాడిచేసేందుకు పనికివస్తాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, December 06, 2013

How much is true gold in purchased ornaments, కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : మనము కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?.
జ : మనము కొన్న బంగారు ఆభరణాలలో తులం బరువుగల ఏ ఆబరణము లోనూ స్వచ్చమైన 24 కారెట్ల (karats) బంగారము తులం ఉండదు .. .. .. ఎందుకంటే పూర్తి స్వచ్చమైన బంగారం తో ఆభరణాన్ని తయారుచేయరు . అలా చేస్తే ఆ నగలు ధరించడానికి అనువుగా ఉండవు . అందుకే స్వచ్చమైన బంగారముతో ఎతర లోహాల్ని మిశ్రమం చేస్తారు. దాంతో ఆభరణానికి గట్టిదనం వస్తుంది. మిశ్రమం చేసే లోహాన్ని బట్టి రంగూ మారుతుంది. ఇతర లోహాల్ని కలిపి ఆబరణం చేయడం వరకూ ఓకె ... కాని ఇతర లోహాలను ఎంత శాతం కలుపుతున్నారన్నదె చాలా ముఖ్యము.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారాన్ని " ట్రాయ్ ఔన్స్ " లలో తూస్తారు . ఔన్స్ బంగారము అంటే సరిగా 31.1034768 గ్రాములు. కొంచెం క్లుప్తం గా 31.103 గ్రాములు . భారతదేశములో బంగారాన్ని తులాలలో తూచడం ఆనవాయితీ . తులం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. తులం బంగారమంటే  11.664 గ్రాములు. ఈ తులాలు బదులుగా ఇప్పుడు మెట్రిక్ కొలమానము '' గ్రాములు'' లో వాడకం అలవాటైనది.

బంగారం స్వచ్చత .. అంటే ఫైన్నెస్ (finess) కారట్ల (karats)పేరుతో తెలయజేస్తారు. విలువైన రాళ్ళ బరువును carat రూపం లో తూస్తారు. బంగారం స్వచ్చతను karat రూపం లో పేర్కొంటారు. ఈ రెండూ ఒకేలా ఉన్నా వాటి విలువలు వేరు. 24 కారట్ల బంగారం అంటే నూటికి నూరు శాతము సంపూర్ణ స్వచ్చమైనది.

కారట్
ఫైన్ నెస్
బంగారం %
24
1000
100
22
916. 7
91. 67
18
750
75
14
583. 3
58. 3
10
416. 7
41. 67
9
375
37. 5

  •  
  •  =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, December 03, 2013

Touch of inverter battary poles no shock why?,ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు.

జవాబు: విద్యుత్‌ వల్ల మనకు షాక్‌ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్‌ ప్రవాహం మీద కన్నా, విద్యుత్‌ పొటన్షియల్‌ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్‌ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్‌ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్‌ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్‌ పొటన్షియల్‌ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్‌ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్‌ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్‌ (N)ధ్రువాన్ని, లైన్‌ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Birds can not slip grip while sliiping How?,నిద్రలోపక్షులు పట్టుజారవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి?

జవాబు: అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, December 01, 2013

Run before Jumping in games Why?,దూరం దూకడానికి ముందు పరుగేల?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
లాంగ్‌జంప్‌ చేసే వ్యక్తి ముందుగా కొంత దూరం పరుగెత్తి ఆ తర్వాత దుముకుతాడు ఎందుకు?

జవాబు: దీన్ని తెలుసుకోవాలంటే చలనం, వేగం, బలం గురించి తెలుసుకోవాలి. మనం ఉన్నచోట నుంచే ముందుకు గెంతాలనుకుందాం. అలా చేయాలంటే, మనం మన శక్తిని ఉపయోగించి నేలను కాళ్లతో తాటించాలి. అది చర్య. దానికి ప్రతిచర్యగా భూమి అంతే బలాన్ని మన కాళ్లపై కలిగించడం వల్ల మనం కాస్త ముందుకు దూకగలుగుతాము. అపుడు మనం ఉపయోగించే శక్తి కొంతమేరకే ఉంటుంది కాబట్టి ఒక స్థాయికి మించి దూకలేం. అంతకు మించి దూకాలంటే, మనకు మరింత బలం తోడవ్వాలి. ఈ అదనపుబలం మనకు వేగం వల్లనే లభిస్తుంది.

ఇప్పుడు న్యూటన్‌ చెప్పిన 'ద్రవ్యవేగం' గురించి తెలుసుకుందాం. ఒక కారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనూ అంతే ద్రవ్యరాశి కలిగిన మరో కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతోనూ వస్తున్నాయనుకొందాం. ఇపుడు మనం వీటిని ఆపాలంటే, ఎక్కువ వేగంతో వస్తున్న కారుపై ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే వేర్వేరు ద్రవ్యరాశులున్న లారీ, కారు మనవైపుకు ఒకే వేగంతో వస్తుంటే, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న లారీని ఆపడానికి ఎక్కువ బలం అవసరమవుతుంది. అంటే ఒక బలాన్ని కొలవాలంటే ద్రవ్యరాశి, వేగం రెండింటి అవసరం ఉందన్నమాట. ఈ రెండింటినీ గుణిస్తే అదే 'ద్రవ్యవేగం' అవుతుందని న్యూటన్‌ చెప్పారు.

దీన్నిబట్టి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని ద్రవ్యవేగంలో మార్పు వస్తుందన్నమాట. ఈ సూత్రమే మనకు 'లాంగ్‌జంప్‌'లో కనిపిస్తుంది. వేగంగా పరుగెత్తుకు వచ్చే క్రీడాకారుడు ద్రవ్యవేగంలోని మార్పువల్ల తగినంత బలాన్ని పొంది, అప్పుడు కాళ్లతో భూమిపై ఆ బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ చర్యకు ప్రతిచర్యగా లభించే బలంతో ఎక్కువదూరం ముందుకు దూకగలుగుతాడు.

- ప్రొ||ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do tatoos harm our body?,టాటూస్‌తో హాని కలుగుతుందా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టాటూస్‌ శరీరంపై వేసుకుంటే ఏ హానీ జరగదా?

జవాబు: సహజరూపమైన శరీరంమీద శాశ్వత ప్రాతిపదికన ఏ పచ్చ పొడిపించుకున్న, ఎలాంటి టాటూస్‌ వేయించుకున్నా ఎంతో కొంత ప్రమాదం ఉండకమానదు. అందుకే పెద్దలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. కాసేపు పూసుకుని సాయంత్రానికో, మధ్యాహ్నానికో స్నానం చేస్తే శుభ్రమయ్యే విధంగా ఉన్న ప్రమాద రహిత వర్ణాల్ని చర్మం మీద ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మల్ని గీయించుకొంటే పెద్దగా ప్రమాదం లేదు. కానీ టాటూస్‌ అలా కాదు. శాశ్వత ప్రాతిపదికన పచ్చబొట్టులాగా కొన్ని రంగుల్ని బొమ్మలుగా సూదుల సాయంతో చర్మంలోకి నింపుతారు. ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్‌ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు.

చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే వృక్ష సంబంధ కారకాలు ప్రమాద రహితమైనవనీ కేవలం కర్మాగారాల్లో తయారై కృత్రిమ, రసాయనాలు ప్రమాదకరమనీ అంటుంటారు. ఆపేరుతో విచ్చలవిడిగా ఈ మధ్య వృక్షోత్పత్తి (herbel products) మందులంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వృక్షాల నుంచి తీసినా, కృత్రిమంగా చేసినా బెంజీన్‌ బెంజీనే. రసాయనిక పదార్థాల ధర్మాలు వాటి మాతృకను బట్టి మారవు. చాలా వృక్షసంబంధ రసాయనాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do frog jump?,కప్ప గెంతుతుందేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అన్ని జీవుల్లా కప్పలు నడవకుండా గెంతులేస్తాయి ఎందుకు?

జవాబు: జంతువులకు వృక్షాలకు ఉన్న అనేక తేడాలలో ప్రధానమైంది జీవులకున్న స్థాన చలనం. కేవలం నడవడం, గెంతడం రెండే జంతువులకున్న స్థాన చలన యంత్రాంగాలు కావు. ఎన్నో రకాల పద్ధతులు జంతువుల్లో ఉన్నాయి. ఒకే జాతిలో కూడా పరిస్థితికి అనుగుణంగా స్థాన చలన పద్ధతిని మార్చుకుంటాయి. పులులు, సింహాలు, కోతులు, పిల్లులు, కుక్కలు మెల్లగా నడిచేప్పుడు ఓ విధమైన పాదగమనం' వేగంగా వెళ్లేప్పుడు మరో విధమైన భంగిమ చూస్తాము. ఆల్చిప్పలు, పక్షులు, చేపలు, కీటకాలు సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు దుముకవు, నడవలేవు. ఆ గమనం వేరు. ఇలా ఎన్నో రకాలైన కదలికల్లో కప్పల కదలిక దుమకడం. వెనక కాళ్లు బలమైనవిగా, ముందు కాళ్లు కాస్త బలహీనంగా ఉన్న జంతువుల్లో ఇలాంటి దూకే విధానం ఉంటుంది. కంగారూలు, చింపాంజీలు, కప్పలు ఈ కోవకు చెందుతాయి.

చతుష్పాద (tetrapod) జీవుల్లో వెనకకాళ్లు దేహానికి దాదాపు సమాంతరంగా ఉంటే, అవి తమ చలనంలో దేహాన్ని బాగా శ్రమకు గురిచేసినట్టవుతుంది. కానీ క్షితిజ సమాంతరంగా ఉన్న దేహానికి దాదాపు నిట్టనిలువుగా కాళ్లుంటే అపుడు కాళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా అడుగులు వేసినపుడు దేహంమీద శ్రమ ఏర్పడదు. నడిచే జంతువుల శరీరాకృతి, వెనుకకాళ్ల నిర్మాణం ఆ విధంగా ఉండటం వల్ల నడవడంతోపాటు, పరుగెత్తేపుడు గెంతగలవు. కానీ కప్పల్లో వెనుక కాళ్లు పక్కలకు ఉండటంతోపాటు వాటిపొట్ట కన్నా ఏమంత కిందుగా ఉండవు. కాబట్టి అవి నడిచినట్లయితే పొట్టనేలకు రాసుకుంటూ పోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇక గెంతడం మినహా మరో దారి లేదు. ఉభయచరాలయిన కప్పలకు తమ స్థావరాలను త్వరితంగా మార్చుకోవడానికీ, తమ భక్షకులు అయిన పాములు, గద్దలు వంటివాటి బారిన పడకుండా తప్పించుకోవడానికి గెంతే పద్ధతి సహకరిస్తోంది కూడా.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, November 27, 2013

How dis Mandoari get that name?,మండోదరికి ఆపేరు ఎలా వచ్చింది ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మండోదరికి ఆపేరు ఎలా వచ్చింది ?

జ:మండోదరి అంటే - కప్ప పొట్ట్ట వంటి  ... పొట్ట కలిగినది అని అర్ధము . కప్ప పొట్టవంటి పొట్టను కలిగి ఉండడము మహారాజ్జీ లక్షణమని సాముద్రికశాస్తములో చెప్పబడినది . తదనుగుణము గానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసునికి పట్టమహిష అయింది.

మండ + ఉదరి = మండోదరి
మండ=పలుచని,
ఉదరము = పొట్ట ,
పలుచని ఉదరము కలది (మండ=పలుచని). మండోదరి'

మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do say Succking like a leech?,జలగ లా పీల్చడం అని ఎందుకటారు ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : జలగ లా పీల్చడం అని ఎందుకటారు ?

జ : జలగ లా పీడిస్తున్నాడంటూ దోచుకునే వారిని వర్ణిస్తారు . జలగ మనుషుల , పశువుల రక్తాన్ని ఆహారముగా గ్రహిస్తుంది. ఇందుకోసము వాటి నోటి నిర్మాణముతో పాటుగా లోపల జీర్ణవ్యవస్థలో పది జతల సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. రక్తము పీల్చి ముందుగా ఆ సంచులను నింపుకొని ఆ తర్వాత తీరికగా తేలికగా జీర్ణము చేసుకుంటుంది .

రక్తము పీల్చేటప్పుడు బాధ తెలియ కుండా ఉండేందుకు ఒక రసాయనాన్ని ప్రయోగిస్తుంది. ఇలా దొంగ లా రక్తము దోచుకుని సంచులలో నింపుకుంటుంది. ఇతరులను దోచుకునేవారిని చూసినప్పుడు జలగలా పీడిస్తున్నాడని అనడం ఆనవాయితీ అయినది
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, November 20, 2013

How many children to Kunbhakarna?,కుంభకర్ణుడు కి ఎంతమంది పిల్లలు ?.

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : కుంభకర్ణుడు కి ఎంతమంది పిల్లలు ?.

జ : బలిచక్రవర్తి మనుమరాలు , వైరోచనుడనే రాక్షసుని కుమార్తె అయిన " వజ్రజ్వాల " కుంభకర్ణుడి భార్య.  రావణాసురుడే స్వయము గా ఈ వివాహాన్ని జరిపించాడు . కుంభకర్ణుడకు ఇద్దరు కుమారులు - కుంభుడు , నికుంభుడు .
  •  ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, November 19, 2013

Wet clothes on body produce shevering why?,వంటిపై బట్టలు తడిస్తే వణుకెందుకు వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప : వంటిపై బట్టలు తడిస్తే వణుకెందుకు వస్తుంది?,
జ : వర్షాకాలములో వాననీళ్ళు మీదపడి బట్టలన్నీ తడిసిపోతే శరీరము చల్లబడి వణికిపోవడము అనుభవమే .ఒంటిమీద పడిన నీటిని బట్టలు పీల్చుకుంటే తిరిగి ఆ నీరు ఆవిరయ్యే ప్రయత్నం చేస్తుంది . అలా ఆవిరయ్యేందు అవసరమైన ఉష్ణోగ్రత శరీరము నుండి తీసుకుంటుంది. ఎంత ఎక్కువ బట్టలు తడిస్తే అంత అధికము గా శరీరములోని వేడి బయటకు వెళ్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది . వేడి బయటకు పోవడము మరింతగా పెరిగితే వణుకు వస్తుంది.
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 15, 2013

Do fish fly?,చేపలు ఎగురుతాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చేపలు ఎగురుతాయా?
జ : ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు . చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలుకాని రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచము దూరము లో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము . శత్రువులనుంది రక్షించుకునేందుకు , ఆహారము వేటాడే సమయములో వేగముగా చలించేందుకు ఇలా ఎగురుతాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is jet lag ?,జెట్‌లాగ్ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర  : జెట్‌లాగ్ అంటే ఏమిటి?
జ : జెట్‌లాగ్‌.. అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు మెలకువగా వుండి, చీకటిపడ్డాక నిద్రపోవడానికి అనుకూలంగా మన శరీరభాగాలు అమరివుంటాయి.ఈ పరిష్థితి జెట్ విమానాలలో ఒకదేశము నుండి  మరో దే్శము ప్రయాణించేవారు మానసికముగాను ,నిద్రపోయో వేలలోను ఒకవిధమైన అన-అనుకూలత ఎదుర్కొంటారు . దీనినే " జెట్ లాగ్ " అంటారు .జీవుల మెదడులో ఒకరకమైన బయొలాజికల్ క్లాక్ (Biological clock) ఉండి నిద్రను క్రమబద్ధము చేస్తూ ఉంటుంది. ప్రకృతికి విరుద్దంగా రాత్రివేళ మెలుకువగా వుండటం కారణంగా వారి శరీరంలోని వివిధ వ్యవస్థలు ముఖ్యంగా నాడీ వ్యవస్థ పనితీరులో మార్పు వస్తుంది. కృత్రిమమైన వెలుతురులో పనిచేయడం, ఎక్కువ సమయం నిద్రకు దూరంగా ఉండటం కారణంగా వారిలో మైగ్రేన్‌ హెడ్‌ఎక్‌, పారాడైమల్‌ న్యాచురల్‌ సఫిలాంజియా వంచి తలనొప్పులు అతిగా వస్తాయి. నిద్రలేమి, అతినిద్ర వంటి స్లీప్‌ రిలేటెడ్‌ వ్యాధులు వస్తాయి. వీరిలో రక్తప్రసరణ వ్యవస్థలో వచ్చే తేడాల కారణంగా బ్లడ్‌ప్రెషర్‌ పెరుగుతుంది. ఆంగ్జటీ, డిప్రెషన్‌ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడి కారణంగా ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిలో పాటు సాప్ట్‌వేర్‌ సంస్థలో పనిచేసే వారిలో స్పాండలైటీస్‌, కంటిసమస్యలు, అసిడిటీ, ఒబేసిటి వంటి సమస్యలు వస్తాయి.

ఈ సృష్టి యావత్తు దినచరులు, నిశాచరులు అని రెండు రకాల ప్రాణులతో నిండి ఉంది. గబ్బిలాలు, గుడ్లగూబలు, అడివి పిల్లులు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, వగైరాలన్నీ రాత్రిపూట ఉత్సాహంగా ఉండి పగటి పూట మబ్బుగా మారిపోతాయి. అవి మేల్కొని ఉన్నా చురుకుగా ఉండలేవు. అందుకే వాటిని నిశాచర ప్రాణికోటి అని పెద్దలు పిలిచారు. పురాణాలలోకి వెళితే దయ్యాలు, భూతాలు, రాక్షసులు, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకినీ వగైరాలందరు నిశాచర జాతికి చెందిన వారిగా కనబడతారు. మనుషులలో కూడా చాలా కాలంగా కావలి ఉద్యోగాలలో ఉండే వారు నిశి అంతా మేలుకుని విధులు నిర్వహించేవారు. ఇదే రాత్రి డ్యూటీగా, నైట్‌ డ్యూటీగా, నైట్‌షిఫ్ట్‌గా తరువాతి కాలంలో ప్రసిద్ధికెక్కింది. నైట్‌ షిఫ్ట్‌ వల్ల పగలు రాత్రిగా, రాత్రి పగలుగా మారిపోతుంది. రాత్రి చేసే పనులు పగలు, పగలు చేసే పనులు రాత్రికి మారిపోతాయి. శరీర తత్వం, ఆహార అలవాట్లు వగైరాలు గణనీయంగా మారిపోతాయి.
మనిషి శరీరం రాత్రి మేలుకుని పనిచేయడానికి అనువుగా నిర్మితమైంది కాదు. పరిసరాలు కూడా రాత్రిపూట పడుకోడానికి అనుకూలంగా వుంటాయి. చీకటి, నినశ్శబ్దాలు కళ్ళు, చెవులకు ఇబ్బంది కలిగించక ప్రశాంతత చేకూరుస్తాయి. మనతోబాటు అందరూ పడుకుంటారు గనుక ఇతర శబ్దాలేవీ వుండవు. కానీ పగటిపూట అనేసరికి వెల్తురు, శబ్దకాలుష్యం ప్రధానంగా ఇబ్బందిపెడ్తాయి. పైగా రాత్రిపూట పడుకున్నట్లు పగటిపూట అన్ని గంటలపాటు పడుకోలేరు కొందరు. వ్యక్తిగత, సామాజిక ఇబ్బందులు కొన్ని ఎదురౌతాయి.

ఎప్పుడైనా ఒకరోజో, రెండ్రోజులో పనుల వత్తిడి, అనారోగ్యం, మనసు బాగోకపోవడం లాంటి అనివార్య కారణాలచేత నిద్ర పట్టకపోతే తర్వాతిరోజు మన ముఖాలు లంఖణాలు చేసిన రోగుల్లా వుంటాయి. కళ్ళు లోతుకుపోయి, ముఖం పీక్కుపోయి... నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. మనిషికి తిండితోబాటు నిద్ర చాలా అవసరం. ఇంకా మాట్లాడ్తే తిండి కంటే కూడా నిద్ర మరీ ముఖ్యం. టైముకు తిని టైముకు పడుకుంటే ఆరోగ్యాలు నిక్షేపాల్లా ఉంటాయి. నైట్‌ డ్యూటీ చేసి పగలంతా గొడ్డు నిద్రపోయినా చాలదు. శరీరం రిలాక్స్‌ అయిన అనుభూతి కలుగదు. విదేశాల నుంచి మనదేశానికి తిరిగి వచ్చినప్పుడు రెండ్రోజులపాటు అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితి..
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the difference in mental maturity of men vs women?,స్ర్తీ-పురుష మానసిక వికాశములో తేడా ఏమిటి ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : స్ర్తీ-పురుష మానసిక వికాశములో తేడా ఏమిటి ?.

జ : భౌతికము గా ఒక వయసు వారైనా స్త్రీ , పురుషులలో మానసిక వికాశము భిన్నము గా ఉంటుంది . ఆడవారు మవవారికన్నా తక్కువ వయసులో మానసిక పరిపక్వతకు వస్తారు. సమస్యలను అర్ధము చేసుకోవడము , విశ్లేషించడమే కాదు ... రాబోయే అంశాలను ముందుగానే పసిగట్ట గలిగిన శక్తి మహిళలకు ముందే వస్తుంది.

ఆడవారు 25 ఏళ్ళకు మానసికం గా పరిపక్వతకు వస్తే  పురుషులు 35 వ సంవత్సరము వరకు ఆష్థాయికి  చేరుకోలేరు . ఆ పది సం.లు తేడామానసిక పరిపక్వములో అలాగే నిలిచి ఉంటుంది. శారీరక బలహీనతను అధిగమించేందుకు  మహిళలకు మేధోపరము గా ఆ శక్తి ప్రకృతి ప్రసాధించిందని అనుకోవాలి . పురుషుడు శారీరక బలమును నమ్ముకున్నందున మానసిక పరిపక్వము ఆలస్యమువుతుందేమోనని భావించుకోవాలి,
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 14, 2013

Paintings-pictures-dolls inside bottles?,సీసా లోపలికి బొమ్మలు ఎలా వెళ్లాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    అద్భుతమైన కట్టడాలు... అందమైన కళాకృతులు... అబ్బురపరిచే విగ్రహాలు... అన్నీ సీసాల్లోకి దూరిపోయాయి! ఇంతకీ లోపలికి ఎలా వెళ్లాయి? అసలెక్కడున్నాయ్‌?

సీసాల్లోకి దెయ్యాలను రప్పించి మూత పెట్టే మాంత్రికుల కథలు బోలెడు చదివే ఉంటారు. అవన్నీ కల్పితాలు. కానీ నిజంగానే సీసాల్లో భవనాలు, విగ్రహాలు ఇంకా వందలాది కట్టడాలుంటే ఆశ్చర్యమే కదూ! ఇవన్నీ చూడాలంటే థాయ్‌లాండ్‌ వెళ్లాలి.

* పట్టాయా నగరంలో 'బాటిల్‌ ఆర్ట్‌ మ్యూజియం' ఉంది. దీంట్లోకెళితే ఎక్కడ చూసినా సీసాలే కనిపిస్తాయి. ఖాళీవి కావు. వాటిల్లో బోలెడు బొమ్మలు కనువిందు చేస్తాయి.
* ఒకటా రెండా, ఈ మ్యూజియంలో ఏకంగా 300కు పైగా సీసాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎన్నో భవనాలు, చర్చిలు, ఆలయాలు, అందమైన ఇళ్ల నమూనాలు ఉంటాయి. అవన్నీ సూక్ష్మ రూపంలో అబ్బురపరుస్తాయి.

* సీసా ద్వారం అంత చిన్నగా ఉంది. మరి అంత పెద్ద కళాఖండాలను లోపలికి ఎలా దూర్చారు? అనే అనుమానం తప్పకుండా వచ్చి తీరుతుంది. అందుకే మ్యూజియంలోకి ప్రవేశించగానే మనకో వీడియో చూపిస్తారు. అందులో దీని వ్యవస్థాపకుల వివరాలు, వాళ్లు వీటిని ఎలాచేశారు, సీసాల్లో ఎలా పెట్టారు? అనే వివరాలు చూపిస్తారు.
* ఈ వింత మ్యూజియాన్ని ప్రముఖ డచ్‌ కళాకారుడు పీటర్‌ బెడిలాయిస్‌ 1995లో ప్రారంభించారు. అయితే సీసాల్లో మనకు కనిపించే నిర్మాణాలను చిన్నచిన్న విడిభాగాలుగా బయటే రూపొందిస్తారు. తర్వాత వాటిని జాగ్రత్తగా బాటిళ్లలో అనుకున్న తీరుగా అతికించి అమరుస్తారు. అయితే ఒక్కో బొమ్మను తయారుచేసి, సీసాలో పెట్టడం చిన్న విషయం కాదు. రోజుకు 15 గంటలు పనిచేస్తే నాలుగైదు నెలల సమయం పడుతుందని అంచనా! పీటర్‌ కొందరు తన శిష్యులతో కలిసి ఇవన్నీ చేశాడు.

* విశాలమైన భవనంలో ఉన్న ఈ మ్యూజియాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒకదాంట్లోని సీసాల్లో ఆకాశహర్మ్యాల్లాంటి అద్భుత భవనాలు, ఇంకా పేరుపొందిన పర్యాటక కట్టడాలు, దేశదేశాల్లో కనిపించే అందమైన ఇళ్ల నమూనాలు కనిపిస్తాయి. రెండో విభాగంలో కళాకృతులు అంటే నౌకలు, సంగీత పరికరాలు, బొమ్మల్లాంటివి, మూడో దాంట్లో చర్చిలు, ఆలయాలు, బుద్ధుడు, ఇంకా ఎన్నో దేవతా మూర్తుల విగ్రహాల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.

* ఇవి చాలా చిన్నగా ఉన్నా ఆకట్టుకునే డిజైన్లు, చెక్కనాలతో కళ్లు తిప్పుకోకుండా చూసేలా చేయడం విశేషం.

source : Hai bujji@Eenadu news paper

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 11, 2013

Do Nature has revange?,ప్రకృతికి ప్రతీకారము ఉంటుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ప్రకృతికి ప్రతీకారము ఉంటుందా?

జ : ప్రకృతి ఒక శక్తి స్వరూపము . దానికి ప్రతీకారాలు , కోపతాపాలు , మంచీచెడులు , తనవాళ్ళు -పరాయివాళ్ళు అంటూ ఏమీ ఉండదు . కానీ ప్రకృతికి ఒక ధర్మము(propety) ఉన్నది . లక్షలాది సంవత్సాల పరిణామ క్రమములో పలు ప్రయోగాలు తర్వాత స్థిరపడిన ధర్మమది. ఆ ధర్మానికి ఒక అర్ధముంది. ప్రకృతిలో నివశించే ప్రతీ జీవి ఆ ధర్మానికి లోబడే ప్రవర్తించాలి . అదే " పర్యావరణ పరిరక్షణ , పర్యావరణ సమతుల్యత " కాపాడుట. జీవ పరిణామ క్రమములో ప్రకృతిలో జీవులు విధి విధానాలు లో మార్పులకు అనుగుణము గా ప్రకృతి సమతుల్యత బేలన్స్ చేయడము . ప్రకృతి అంటే ... చెట్టు చేమా, నోరు వాయిలేని జంటువులు మాత్రమేనని ఆ బలహీన జీవాలన్నీ తకోసమే ప్రకృతిలో ఉన్నాయని భావించి మానవుడు  ప్రకృతి ధర్మానికి విరుద్ధముగా ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నాడు , తన స్వార్ధముకోసం ఎన్నో పాప , అధర్మ , అనైతిక , విధ్వంసక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు . మనిషి స్వార్ధాన్ని భరించలేని ప్రకృతి తకిగ సమయం చూసి  తన విలయతాండవం , విశ్వరూపం ను  చూపిస్తూ ఎదురుదాడి చేస్తూ ఉన్నది . అందుకు నిదర్శనమే ఈ తూఫాన్లు , జలప్రళయాలు , సునామీలు , వరదలు , అతివృష్టి , అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు . దీనినే మనము ప్రకృతి ప్రతీకారము గా అనుకోవచ్చు .

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Refrigirator make sound at interval Why?.రిఫ్రిజిరేటర్‌ అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటుందెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: రిఫ్రిజిరేటర్‌ అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటుంది. ఎందుకు?

జవాబు: రిఫ్రిజిరేటర్‌ ఒక నియమిత, కాలపరిధిలో శబ్దం చేస్తుంటుంది. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చిన కంప్రెసర్‌ తరచూ స్విచాన్‌, స్విచాఫ్‌ కావడమే. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతను కొలిచి నియంత్రించే థర్మోస్టార్ట్‌ అనే మరో భాగంతో కంప్రెసర్‌ అనుసంధానమై ఉంటుంది. ఫ్రిజ్‌ లోపలి భాగం సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఇక చల్లబడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వెంటనే థర్మోస్టార్ట్‌ కంప్రెసర్‌కు ఎలక్ట్రిక్‌ పవర్‌ అందకుండా ఒక సంకేతం పంపుతుంది. దాంతో కంప్రెసర్‌, రిఫ్రిజిరేటర్‌ లోపలి భాగాన్ని చల్లబరిచే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇదంతా విద్యుచ్ఛక్తి వృథా కాకుండా చేసిన ఏర్పాటన్నమాట. తర్వాత ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. ఒక నియమిత స్థితికి రాగానే థర్మోస్టార్ట్‌ మళ్లీ సంకేతం పంపడంతో విద్యుత్‌ వలయం పూర్తయ్యి కంప్రెసర్‌ ఆన్‌ అవుతుంది. కంప్రెసర్‌ ఒక యాంత్రిక వ్యవస్థ (mechanical sysytem) కాబట్టి అది ఆన్‌ అయినపుడల్లా శబ్దం వస్తుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Rain is not falling as continous flow Why?,వర్షం ధారలుగా కురవదేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వర్షం ధారల్లాగా కాకుండా నీటి బొట్లుగా ఎందుకు పడుతుంది?

జవాబు : వర్షం ధారలాగా కురవకుండా, బొట్లలాగా, నీటి బిందువులుగా పడడానికి కారణం నీటికున్న తలతన్యత (Surface tension) అనే లక్షణం. ప్రతీ ద్రవం తన ఉపరితల వైశాల్యాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకునేలా ప్రవర్తిస్తుంది. అంటే నిర్ణీత ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం ఉన్న ద్రవ పదార్థానికి అతి కనిష్ట ఉపరితలాన్ని ఇచ్చే జ్యామితీయ నిర్మాణం (Geometry) అంటే గోళాకారమే. ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్న మేఘాల నుంచి కురిసే వాన పగిలిన నీటి ట్యాంకునుంచి పడ్డట్టుగా ఉండదు. అంటే నీరు మేఘంలో ఉండదు. కొంచెం కొంచెంగా వాయురూపంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీభవించి వర్షంగా కురుస్తుంది. ఆ విధంగా కింద పడుతున్న వర్షపు నీరు తన తలతన్యత లక్షణాన్ని బట్టి బిందు రూపంలోకి చేరుకుంటుంది. ఆ రూపాన్ని చేరుకునేలోగానే వెనక నీరు దాన్ని అంటిపెట్టుకోకపోవడం వల్ల వర్షం చుక్కలుగానే పడుతుంది. మరి కొళాయి నీరెందుకు అలా పడదు? కొళాయి నీరు బిందు రూపంలోకి చేరుకునే లోగానే వెనక నుంచి వేగంగా వచ్చే నీరు కలవడం వల్ల అది ధారగానే పడుతుంది. కొళాయి ప్రవాహం బాగా తగ్గించితే అక్కడా నీటి చుక్కలు బొట్లుగానే కిందికి దూకుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, November 09, 2013

What are the situations to tell lies in Hindu Epics?,హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి?

జ : అబద్దాలాడడము దోషముతోనూ , పాపముతోనూ కూడుకున్నదని పురాణాలు లో చిప్పబడిఉన్నది . అబద్దమాడుట అష్టవ్యసనాలలో ఒకటి.  కొన్ని సమయాలలో అబద్దమాడినా దోషము లేదని అవే పురాణాలు చిన్న వెలుసుబాటును కల్పించాయి. మరి కలియుగములో అబద్దమాడనివాడంటూ లేరు ... అసలు అబద్దమాడితేనే జీవితము సుఖముగా గడుస్తుంది .  పురాణాలు లో వెలుసుబాటు ఈ క్రింది వాటికి ఇవ్వడము మనము చదువుతూ ఉంటాం .

  • స్త్రీ-వివాహము ,
  • ప్రాణరక్షణ ,
  • ధనరక్షణ ,
  • మానరక్షణ ,
  • గో-బ్రాహ్మణ సహాయము ,

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 07, 2013

People die of thunderbolt How?,పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా ?

జవాబు: పిడుగు పాటుకు మనుషులు చనిపోవడాన్ని, భవనాలు, చెట్లు కూలడాన్ని ఈ మధ్య మనం వార్తల్లో తరచూ వింటున్నాం. అందుకు కారణం పిడుగు పాటులో ఉన్న అత్యధిక విద్యుత్తు పొటెన్షియల్‌ మాత్రమే. పిడుగు అంటే రూపురేఖలున్న వస్తువు కాదు. నిజానికి పిడుగుపాటుకు మరణించేది ఉరుముల సమయంలో కాదు. ఆ పాటికి పూర్తయిన మెరుపుల సమయంలోనే. పిడుగుపాటు అంటే మెరుపులో ఉన్న అత్యధిక విద్యుత్తు ప్రవాహం మనిషి శరీరంగుండా, లేదా భవనాల తడి గోడల గుండా, చెట్లగుండా భూమిని చేరడమే. తద్వారా కలిగే షాక్‌వల్ల మనుషులు మరణిస్తారు. విడుదలయ్యే అధిక వేడివల్ల భవనాలు, చెట్లు కూలిపోతాయిభ్

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Batary poles donot give shock like electricity Why?,కరంటు దృవాలు షాక్ కొట్టినట్లు బేటరీ దృవాలు షాక్ కొట్టవేమి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు.

జవాబు: విద్యుత్‌ వల్ల మనకు షాక్‌ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్‌ ప్రవాహం మీద కన్నా, విద్యుత్‌ పొటన్షియల్‌ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్‌ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్‌ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్‌ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్‌ పొటన్షియల్‌ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్‌ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్‌ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్‌ (N)ధ్రువాన్ని, లైన్‌ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, October 31, 2013

All the blood vessels are not equal?,రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

జ : శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్‌ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి  శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who are the Rulers of eight-directions of Earth?,అష్టదిక్పాలకులు ఎవరు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : అష్టదిక్పాలకులు ఎవరు ? వారి భార్యల పేర్లు తెలియజేయండి.

జ : నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.

  • తూర్పు దిక్కుకు ఇంద్రుడు---భార్య శనీదేవి--వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు., ,
  • పడమర దిక్కుకు వరుణుడు---భార్య కాళికాదేవి------------- మొసలి ,
  • దక్షిణ దిక్కుకు యముడు,---భార్య శ్యామలాదేవి-----------మహిశము (దున్న) ,
  • ఉత్తర దిక్కుకు కుబేరుడు----భార్య చిత్రరేఖాదేవి-వాహనం నరుడని, మేషమనీ, గాడిద అనీ రకరకాలుగా చెప్పబడింది,- ,
  • ఆగ్నేయానికి అగ్నిదేవుడు---భార్య స్వాహాదేవి---మగమేక=పొట్టేలు/మగగొర్రె ,
  • నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి--భార్య దీర్ఘాదేవి ------------గుర్రము  ,
  • వాయువ్య దిక్కుకు వాయుదేవుడు----భార్య అంజనాదేవి---------జింక  ,
  • ఈశాన్య దిక్కుకు ఈశానుడు----భార్య పార్వతీదేవి,------------నంది  ,
 source : Wikipedia.org/
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, October 27, 2013

How did Aswaddhaama get his name?,అశ్వద్ధామ కు ఆ పేరు ఎలా వచ్చింది ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : అశ్వద్ధామ కు ఆ పేరు ఎలా వచ్చింది ?

జ : కృపాచార్యుని చెల్లెలైన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహము చేయడం జరిగినది . వీరికి జర్మించిన కుమారుడే అశ్వద్ధామ .  అశ్వద్ధామ జన్మించినప్పుడు గుర్రం వలె అరిచి ఏడ్చాడట ... అందువల్ల ఆ బాలుడికి " అశ్వద్ధామ " అని ఆకాశవాణి పేరుపెట్టడం జరిగిందని పురాణాలు లో చెప్పబడి ఉన్నది. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How were seas formed?-సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి ?

  •  

  •  నది -------------------------------------సముద్రము
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి ?

జ : భూమి ఒకప్పుడు  వాయు , ద్రవ స్థితులలో ఉండగా నీరు ఆవిరి రూపములో భూమిని ఆవరించి ఉండేది. కాలక్రమేణా భూగోళం చల్లబడడం తో ఆ ఆవిరి ద్రవీభవించి భూమిపై వర్షము గా పడిఉంటుంది . సూర్య రశ్మి వేడికి తిరిగి ఆవిరై మరలా వర్షము గా పడడము ... ఇలా కొన్ని వేళ సంవత్సరాల పాటు జరుగగా భూగోళము పూర్తిగా చల్లబడిందని ... ఆ వర్షము నీరు భూమిమీద ఉన్న పల్లపు ప్రాంతాలను చేరగా సముద్రాలు , నదులు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయము .  అలా సముద్రాలు ఏర్పడ్డాయి.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, October 20, 2013

How is lightening forming in the Sky?,ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ఫ్ర : How is lightening forming in the Sky?,ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?

జవాబు : ఆకాశములో గాలిలో కలిగే ఘర్షణ వల్ల మేఘాలలో విద్యుదావేశం ఏర్పడుతుంది . మేఘాలలో విద్యుదావేశం అధికమైనప్పుడు అది ఒక మేఘం నుండి  మరో తక్కువ విద్యుదావేశమున్న మేఘం పైకి దూకుతుంది. అలా దూకుతున్న విద్యుదావేశము తో శక్తివంతమైన కాంతి వెలువడుతుంది.అదే మనకు కనిపించే మెరుపు . మేఘాలలో విద్యుత్ ఆవేశము కొన్ని సందర్భాలలో భూమిమీదికి దుముకుతుంది . దానినే పిడుగు అంటాం .  పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు.  ఆ పిడుగు వేడికి , తాకిడికి  అడ్డువచ్చిన మనుషులు చెట్లు కాలి మసి అయిపోతాయి. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.
 
మూలము : వికీపెడియా.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, October 12, 2013

Frogs slide on holding in hand Why?,కప్పలను పట్టుకుంటే జారుతాయేం?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:కప్పలను పట్టుకొంటే జారిపోతాయెందుకు?

జవాబు: నీటిలోనే కాకుండా నేలపై చరించే కప్పవంటి ఉభయ చరాల శరీరాలపై ఉండే చర్మంపై పొర తడిగా, జిగురుగా పట్టుకొంటే జారిపోయే ధర్మం కలిగి ఉంటుంది. దీనివల్ల అవి వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి పొడిబారిపోకుండా ఉంటాయి. కప్ప శరీరంపై ఉండే చర్మం దృఢంగా ఉండకుండా పలుచగా ఉండడంతో ఆ చర్మానికి భాష్పీభవనం (evaporation) నుండి అంతగా రక్షణ లభించదు. దాంతో 25 శాతం నుంచి 30 శాతంకన్నా దేహంలోని ద్రవపదార్థాలు ఆవిరైతే అది జీవంతో ఉండలేదు. అందువల్ల కప్ప చర్మం నిరంతరం శ్లేష్మం (mucus)ను, ఇతర పదార్థాలను స్రవించే గ్రంధులను కలిగి ఉంటుంది. గ్రంధుల నుండి స్రవించే ఈ స్రావాలు కప్పదేహంలోని నీటిని సమతుల్యంలో ఉంచుతాయి. అలాగే ఆ స్రావాలలో ఉండే విషంతో కూడిన సమ్మేళనాలు కప్పలను వాటిని తినే ప్రాణుల నుండి, బాక్టీరియా, ఫంగస్‌ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. కప్పలు తమలో ఉండే గ్రంధుల ద్వారా సూర్యరశ్మి ప్రభావం తమ చర్మంపై పడకుండా ఒక తెరను కూడా ఏర్పరచుకోగలవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.- http://dr.seshagirirao.tripod.com/

How can light travel in the Space?,అంతరిక్షంలో కాంతి ఎలా ప్రయాణిస్తుంది?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అంతరిక్షంలో ఏ యానకం లేకుండా నక్షత్రాల నుంచి కాంతి మనల్ని ఎలా చేరుతుంది?

జవాబు: కాంతి ప్రయాణించాలంటే యానకం (medium) ఉండాలనుకోవడం తప్పు. శబ్దతరంగాలు, పాదార్థిక తరంగాల వంటివి ప్రయాణించాలంటే యానకం ఉండాలి. కానీ కాంతి ప్రయాణానికి అవసరం లేదు. ఎందుకంటే కాంతి స్వభావ రీత్యా విద్యుదయస్కాంత తరంగాల క్రమానుగమనం (Electro magnetic wave propagation). ఈ విధమైన తరంగాల గమనానికి యానకం అవసరం లేదు. నిజానికి శూన్యంలోని కాంతికి అత్యధిక వేగం ఉంది. విశ్వంలో ఈ వేగానికి (3X108 మీ/సె) మించి మరేదీ ప్రయాణించలేదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, October 11, 2013

How Insects withstand in cold climate?,కీటకాలు చలినెలా తట్టుకుంటాయ్‌?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి?

జవాబు: మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పడిపోగానే ఆ మార్పులకు అనుగుణంగానే కీటకాలు తమ శరీర ధర్మాలను సర్దుబాటు చేసుకోవడంతో వాటి జీవసంబంధిత ధర్మాలన్నీ (vital functions) శూన్యదశకు చేరుకుంటాయి. ఈ దశలో అవి ఒక సురక్షిత ప్రదేశాన్ని చేరుకొని గుడ్లు లేక లార్వా రూపంలో ఉండే తమ సంతానాన్ని చలి బారి నుండి కాపాడుకుని ఆ తర్వాత వచ్చే వసంత కాలంలో జీవించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాయి. గుడ్లు లేక లార్వా దశలో ఉన్న కీటకాలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని కీటకాల లార్వాలు శీతాకాలంలో సరస్సులలో గడ్డకట్టకుండా ఉండే నీటి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిసరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do ants lift more weight?,చీమ తనబరువు కంటే ఎక్కువ బరువు ఎలా ఎత్తగలుగుతుంది?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు?

జవాబు: బరువు ఎత్తడం ఎత్తకపోవడం అనే విషయం కేవలం చిన్న ప్రాణి, పెద్ద ప్రాణి అన్న లక్షణానికే పరిమితం కాలేదు. శరీర నిర్మాణం, నేలకు బరువుకు మధ్య ఉన్న దూరం, ఎన్ని బిందువుల మీద నేలకు శరీరం తాకి ఉంది అన్న అనేక విషయాలు బరువు నెత్తే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. చీమ ఆర్థ్రోపొడ (కీళ్లు అధికంగా ఉన్న కాళ్లుగల) వర్గంలో కీటకాల తరగతికి చెందిన జీవి. ఇది చతుష్పాది (tetrapod) అంటే తాను ఎత్తే బరువు నాలుగు కాళ్ల మీదికి విభజన అవుతుంది. పైగా కాళ్లు గట్టిగా ఉన్న కైటిన్‌ అనే ప్రోటీన్‌ నిర్మితం. కాబట్టి తన బరువు కన్నా చాలా రెట్లు అధికంగా ఉన్న బరువును కూడా కొంత దూరం పైకి ఎత్తి పట్టుకోగలదు. తాను ఎత్తే బరువుకు నేలకు మధ్య ఉన్న దూరం కూడా తక్కువే ఉండడం వల్ల తనకు అవసరమయ్యే శక్తి కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే పైకెత్తబడిన వస్తువు స్థితి శక్తి (potential energy) mgh ని కలిగివుంటుందని, దాన్ని ఎమ్‌జీహెచ్‌గా కొలుస్తారని తరగతుల్లో చదివే ఉంటారు. ఇక్కడ mg అంటే బరువు, h అంటే ఎత్తు అని అర్థం. కానీ మనిషి ద్విపాది (bipod). రెండు కాళ్ల మీదే భారమంతా పడుతుంది. కాబట్టి శరీర పరిమాణంతో పోల్చితే నాలుగు కాళ్లున్న చీమ రెండు కాళ్లున్న మనిషికన్నా ఎక్కువ బరువు ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. అయితే చీమ తన బరువు కన్నా అయిదారు రెట్ల బరువును మాత్రమే ఎత్తగలదు కానీ 50 రెట్లు అధిక బరువును ఎత్తగలదనడంలో నిజం లేదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Moon light is not hot why?,సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు?,చందమామ చల్లగా ఉంటాడేం?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి భూమిని చేరుతుంది కదా. మరి సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు? సూర్యకాంతి వేడిగా ఎందుకుంటుంది?

జవాబు: ముందుగా సౌరకాంతి చాలా వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. సౌరగోళం కేంద్రక సంలీన చర్య (nuclear fusion) ల ద్వారా విడుదలయ్యే అత్యధిక శక్తి నిలయం. ఇది ఎంత శక్తి అంటే సౌరగోళం లోపల ఉష్ణోగ్రత కొన్ని లక్షల సెంటీగ్రేడు డిగ్రీలుంటుంది. అలాంటి అగ్ని గోళం నుంచి విడుదలయ్యే కాంతి తీవ్రత చాలా హెచ్చుగా ఉండడం వల్ల మనకు అది వేడిగా అనిపిస్తుంది. కానీ సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది(Absorbed). కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం (Scattering) చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము.

మీరు తరగతిలో ఉపాధ్యాయుణ్ని, నల్లబల్లను చూస్తారు. అక్కడ పడ్డ కాంతినే మీరు చూస్తున్నారు. మనం చూసే అన్ని వస్తువుల నుంచి కాంతి మన కంటిని చేరడం వల్లనే ఆయా వస్తువులను మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ కాంతి వేడిగా ఉండదు కదా! అలాగే చంద్రుడిమీద పడి మనల్ని చేరే సౌరకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వేడిగా అనిపించదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌; వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

చందమామ చల్లగా ఉంటాడేం? 26-May-2015

ప్రశ్న: 'చల్లని రాజా ఓ చందమామా' అంటూ మనం పిలిచే చంద్రుడు అలా చల్లగా ఎందుకుంటాడు? వేడిగా ఉన్న సూర్యకాంతినే ప్రతిబింబిస్తాడు కాబట్టి వేడిగా ఎందుకు ఉండడు?

జవాబు: 'చల్లని రాజా ఓ చందమామా' అని పిలిచేంత చల్లని భాగం, సూర్యుని కాంతిని ప్రతిబింబించే వేడి భాగం రెండూ చంద్రుడిపై ఉన్నాయి. మన భూమి తన చుట్టూ తాను ఓసారి తిరగడానికి పట్టే కాలాన్ని 'దినం' అంటారు. అంటే కేవలం 24 గంటల్లోనే ఒకసారి తన చుట్టూ తాను భూమి తిరగడం వల్ల సూర్యుడి కాంతి పడే భాగం పగలుగా సుమారు 12 గంటలు ఉండగా, సౌర కాంతి సోకని అవతలి భాగంలో రాత్రిగా మరో 12 గంటలు ఉంటుంది. తద్వారా భూమ్మీద రేయింబవళ్లు 24 గంటల వ్యవధిలోనే మారడం వల్ల వాతావరణం మరీ విపరీతంగా పగలు వేడెక్కకుండా మరీ విపరీతంగా రాత్రి చల్లబడకుండా ఉండి మనల్ని, ఇతర ప్రాణుల్ని రక్షిస్తోంది. కానీ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే భ్రమణకాలం దాదాపు 28 రోజులు. అంటే చంద్రుడి మీద సౌరకాంతి పడి మనము వెన్నెలగా కనిపించే సగభాగంలో అక్కడి నేల ఉష్ణోగ్రత సుమారు 200 డిగ్రీల సెల్సియస్‌ పైచిలుకు ఉంటుంది. అదే సమయంలో చంద్రుడికి ఆవలివైపు (మన వైపు కనబడని భాగం) సుమారు 14 రోజులు చీకటి ఉండటం వల్ల అక్కడి నేల ఉష్ణోగ్రత సుమారు -120 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. కాబట్టి మనకు కనిపించని అతి చల్లని చంద్రుడు, సలసల నీటిని మరిగించగల అతి ఉష్ణోపరితలముగా మనకు కనిపించే చంద్రుడు రెండూ ఆ చంద్రుడిలో అటూఇటూ ఉన్నాయి. ఇక సూర్యుడి కాంతి చంద్రుడిపై పడ్డాక ప్రతిఫలించి మనకు చేరుతుంది కాబట్టి ఆ వెలుగులో వేడి ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,--జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)
  • ================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-