ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : అష్టదిక్పాలకులు ఎవరు ? వారి భార్యల పేర్లు తెలియజేయండి.
జ : నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.
- తూర్పు దిక్కుకు ఇంద్రుడు---భార్య శనీదేవి--వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు., ,
- పడమర దిక్కుకు వరుణుడు---భార్య కాళికాదేవి------------- మొసలి ,
- దక్షిణ దిక్కుకు యముడు,---భార్య శ్యామలాదేవి-----------మహిశము (దున్న) ,
- ఉత్తర దిక్కుకు కుబేరుడు----భార్య చిత్రరేఖాదేవి-వాహనం నరుడని, మేషమనీ, గాడిద అనీ రకరకాలుగా చెప్పబడింది,- ,
- ఆగ్నేయానికి అగ్నిదేవుడు---భార్య స్వాహాదేవి---మగమేక=పొట్టేలు/మగగొర్రె ,
- నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి--భార్య దీర్ఘాదేవి ------------గుర్రము ,
- వాయువ్య దిక్కుకు వాయుదేవుడు----భార్య అంజనాదేవి---------జింక ,
- ఈశాన్య దిక్కుకు ఈశానుడు----భార్య పార్వతీదేవి,------------నంది ,
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...