ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ఫ్ర : How is lightening forming in the Sky?,ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?
జవాబు : ఆకాశములో గాలిలో కలిగే ఘర్షణ వల్ల మేఘాలలో విద్యుదావేశం ఏర్పడుతుంది . మేఘాలలో విద్యుదావేశం అధికమైనప్పుడు అది ఒక మేఘం నుండి మరో తక్కువ విద్యుదావేశమున్న మేఘం పైకి దూకుతుంది. అలా దూకుతున్న విద్యుదావేశము తో శక్తివంతమైన కాంతి వెలువడుతుంది.అదే మనకు కనిపించే మెరుపు . మేఘాలలో విద్యుత్ ఆవేశము కొన్ని సందర్భాలలో భూమిమీదికి దుముకుతుంది . దానినే పిడుగు అంటాం . పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. ఆ పిడుగు వేడికి , తాకిడికి అడ్డువచ్చిన మనుషులు చెట్లు కాలి మసి అయిపోతాయి. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.
మూలము : వికీపెడియా.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...