ప్రశ్న: కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి?
జవాబు: మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పడిపోగానే ఆ మార్పులకు అనుగుణంగానే కీటకాలు తమ శరీర ధర్మాలను సర్దుబాటు చేసుకోవడంతో వాటి జీవసంబంధిత ధర్మాలన్నీ (vital functions) శూన్యదశకు చేరుకుంటాయి. ఈ దశలో అవి ఒక సురక్షిత ప్రదేశాన్ని చేరుకొని గుడ్లు లేక లార్వా రూపంలో ఉండే తమ సంతానాన్ని చలి బారి నుండి కాపాడుకుని ఆ తర్వాత వచ్చే వసంత కాలంలో జీవించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాయి. గుడ్లు లేక లార్వా దశలో ఉన్న కీటకాలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని కీటకాల లార్వాలు శీతాకాలంలో సరస్సులలో గడ్డకట్టకుండా ఉండే నీటి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిసరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...