ప్ర : రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?
జ : శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు.
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...