ప్రశ్న: రిఫ్రిజిరేటర్ అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటుంది. ఎందుకు?
జవాబు: రిఫ్రిజిరేటర్ ఒక నియమిత, కాలపరిధిలో శబ్దం చేస్తుంటుంది. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చిన కంప్రెసర్ తరచూ స్విచాన్, స్విచాఫ్ కావడమే. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతను కొలిచి నియంత్రించే థర్మోస్టార్ట్ అనే మరో భాగంతో కంప్రెసర్ అనుసంధానమై ఉంటుంది. ఫ్రిజ్ లోపలి భాగం సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఇక చల్లబడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వెంటనే థర్మోస్టార్ట్ కంప్రెసర్‌కు ఎలక్ట్రిక్ పవర్ అందకుండా ఒక సంకేతం పంపుతుంది. దాంతో కంప్రెసర్, రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని చల్లబరిచే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇదంతా విద్యుచ్ఛక్తి వృథా కాకుండా చేసిన ఏర్పాటన్నమాట. తర్వాత ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. ఒక నియమిత స్థితికి రాగానే థర్మోస్టార్ట్ మళ్లీ సంకేతం పంపడంతో విద్యుత్ వలయం పూర్తయ్యి కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఒక యాంత్రిక వ్యవస్థ (mechanical sysytem) కాబట్టి అది ఆన్ అయినపుడల్లా శబ్దం వస్తుంది.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...