Saturday, March 01, 2014

Do we rotate along with Earth rotation,భూమితో పాటు మనం కూడా తెరుగుతామా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్ర : భూమితో పాటు మనం కూడా తెరుగుతామా?
జ : భూమి వేగము గా ఇరుసు మీద తాను తిరుగుతున్నా దానిమీద ఉన్నటువంటి చెట్లు , జంతువులు , ఏవీ గుండ్రముగా తిరిగే భూమిమీదనుంచి పైకి ఎగిరిపోవడము లేదు. అందుకు కారణము భూమికి ఉన్నటువంటి ఆకర్షణశక్తి . ఆ ఆకర్షణశక్తి వల్లనే సముద్రజలాలు, గాలి ,వస్తువులు అన్నీ భూమిని అంటిపెట్టుకునే తిరుగుతాయి. భూబ్రమణముతో పాటు జీవులు , గాలి , నీరు అన్నీ కలసి తిరుగుతున్నాయి.. . . కాబట్టి మనకు ఆ తిరుగుడు ప్రభావము తెలియదు. వాస్తవం లో మనుషులు , నిర్మాణాలు అన్నీ భూమితోపాటు తిరుగుతాయి. 
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...