ప్ర : మంటనుండి వేడి వస్తుందెందుకు?
జ : ఒక్కొక్క వస్తువు మండుతుంటే ఒక్కొక్క స్థాయి వేడి వస్తుంది. మండడానికి ఆక్షిజన్ కావాలి. గాలిలో వుండే ఆక్షిజన్‌ని తీసుకుంటూ ఇంధనము మండుతుంది. అయితే నేరుగా చెక్కముక్క లేదా కాగితము ఆక్షిజన్ ఉన్నా మండవు . అందుకు కారణము అవి మండేందుకు అధిక ఉష్ణోగ్రత అవసరము. ఆ ఉష్ణోగ్రతను అగ్గిపుల్లతో గీసి అందిస్తాము. ఒక స్థాయి వేడికి చేరితేనే ఆక్షిజన్ ఆ ఇంధనాన్ని మండించేందుకు సహకరిస్తుంది. మండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో ఆ మేరకు 'వేడి' మంటనుండి బయటకు వస్తుంది . భిన్న వస్తువులు మండుతుంటే భిన్న రీతులలో వేడి రావడానికి కారణము అదే.
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...