ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : వర్షం పడితే వానపాములు వస్తాయెందుకు ?
జ : వాన పడినప్పుడు కనిపించే వాన పాములు వర్షం తో పడవు . భూమిలో పలుబొరియలు చేసుకుని నివసిస్తాయి . వాటి శ్వాసక్రియకు గాలి కావాల్సిందే. గాలిని చర్మం మీద తేమలో కరిగించుకిని వానపాములు శ్వాసిస్తాయి. వర్షం నీరు వాటి బొరియలోకి చేరినప్పుడు శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడి బొరియవదిలి బయటకు వచ్చి తిరుగుతాయి. వర్షం నీరు తగ్గగానే తిరిగి బొరియలోపలికి వెళ్ళిపోతాయి.
- ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...