ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: కొన్ని జాతుల ద్రాక్షల్లో గింజలు ఉండవు ఎందుకు?
జవాబు: ఏ పండుకైనా విత్తనం కానీ, గింజకానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. అయితే శాస్త్ర విజ్ఞానం పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి ఫలాలు మనకు లభిస్తున్నాయి.
మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మొక్కలు పెరుగుతాయని మనందరికీ తెలుసు. కానీ సరికొత్త పద్ధతులనుపయోగించి తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ పద్ధతిని 'క్లోనింగ్' అంటారు.
క్లోనింగ్ అంటే ప్రకృతి సహజమైన సంపర్కంతో సంబంధం లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలుండే ప్రాణుల సృష్టి. ఈ ప్రక్రియతో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, ఆపిల్, చెర్రీ లాంటి పండ్లు లభిస్తున్నాయి.
ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత కొమ్మకు భూమిలో వేర్లు, భూమి పైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే సీడ్‌లెస్ పండ్లన్నమాట. ఇలా ఏర్పడిన పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడతాయి. కానీ క్లోనింగ్ చేయడం వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజల లాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.
- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...