ప్రశ్న: చలి కాలంలో ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉండే కూరగాయలు ఎండా కాలంలో తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. ఎందుకు? ఏ కాలంలోనైనా ఉండేది ఆ ఫ్రిజ్‌లోనే కదా?
జవాబు: చలికాలంలోను, వేసవి కాలంలోను ఫ్రిజ్ అదే అయినా వాతావరణం, వాతావరణం(ఇంటి)లో ఉండే సూక్ష్మ జీవుల జనాభా, ఫ్రిజ్‌కు ఉండే విద్యుత్ శక్తి తీరు తెన్నులు ఈ రెండు కాలాల్లో ఒకే రకంగా ఉండవు. కూరగాయలు బయట ఉంటే చెడిపోవడానికి, ఫ్రిజ్‌లోపల ఉంటే నిల్వ ఉండటానికి కారణం ఫ్రిజ్‌లోకి సూక్ష్మజీవులు వెళ్లలేక కాదు. అదే నిజమయితే అల్మారాలో పెట్టినా కూరగాయలు నిల్వ ఉండాలి. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బాక్టీరియా, తదితర సూక్ష్మక్రిములు తమ జీవన కార్యకలాపాల్ని అంత తక్కువ ఉష్ణోగ్రత దగ్గర చేపట్టలేవు. అందువల్ల కూరగాయలు కొంతకాలం పాటు నిలువ ఉంటాయి. పైగా చలికాలంలో విద్యుత్ సరఫరాలో 'పవర్ కట్'లు తక్కువ. కాబట్టి ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత నిలకడగా, తక్కువగా ఉంటుంది. అలాగే వాతావరణం కూడా చల్లగానే ఉండటం వల్ల వాతావరణంలోని సూక్ష్మజీవుల జనాభా తక్కువ ఉంటుంది. కాబట్టి కూరగాయల్ని ఆశించే క్రిములు తక్కువ. వేసవి కాలంలో తగినంత ఉష్ణోగ్రత ఇంటి వాతావరణంలో ఉండటం వల్ల ఫ్రిజ్‌లోని వస్తువుల మీద దాడి ఎక్కువ. పైగా పవర్ కట్‌లు కూడా ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచవు.
- -ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...