ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : body cells don't Die? , శరీరములో కణాలు మృతిచెందవా?.
జ : శరీరమంటేనే కణాల సముదాయము .ఇందులో ప్రతి కణానికీ మరణము ఉంటుంది. ఒక్కొక్క రకము కణానిది ఒక రకమైన ఆయుర్ధాయము . మనకు తెలియకుండానే మన శరీరములో కణాలు మరణించడము , వాటి స్థానము లో కొత్త కణాలు పుట్టుకురావడము జరుగుతుంటుంది .
- పేగు పైపొర కణాలు ప్రతి 5 రోజులకు పాత వాటిస్థానములో కొత్తవి వస్తుంటాయి.
- తెల్ల రక్తకణాలు 2 నుండి 4 సం.లు ,
- ఎర్ర రక్త కణాలు 90-120 రోజులు లలో మృతిచెందుతాయి.,
- మన చర్మము మీద ఉన్న కణాలు ప్రతి 15 నుండి 20 రోజులకొకసారి కొత్తవి వస్తుంటాయి.
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...